ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అతడి రక్తంలో మ్యాజిక్‌ పుట్టగొడుగులు!!

ABN, First Publish Date - 2021-01-18T12:58:39+05:30

అమెరికాలో ఓ ముప్పై ఏళ్ల యువకుడి రక్తంలో ‘మ్యాజిక్‌ పుట్టగొడుగులు’ పెరిగాయి. ఇదెలా జరిగిందంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లోసైబిన్‌’ టీతో ఇంజెక్షన్‌.. బెడిసికొట్టిన సొంత వైద్యం


లాస్‌ ఏంజెలెస్‌, జనవరి 17 : అమెరికాలో ఓ ముప్పై ఏళ్ల యువకుడి రక్తంలో ‘మ్యాజిక్‌ పుట్టగొడుగులు’ పెరిగాయి. ఇదెలా జరిగిందంటే.. ఆ యువకుడు బైపోలార్‌ డిజార్డర్‌ అనే మానసిక రుగ్మతతో బాధపడేవాడు. చికిత్సలో భాగంగా వైద్యులు ఇస్తున్న మత్తు ఔషధాల వినియోగాన్ని తగ్గించేందుకు.. వాటికి ప్రత్యామ్నాయాలను ఇంటర్నెట్‌లో వెతకసాగాడు. ‘సైలోసైబిన్‌’ రకం పుట్టుగొడుగులను మ్యాజిక్‌ పుట్టుగొడుగులుగా పిలుస్తారని, వాటి వాడకంతో బైపోలార్‌ డిజార్డర్‌, మానసిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందంటూ ఓ చోట ప్రస్తావించడాన్ని గుర్తించాడు. వెంటనే వాటిని తెప్పించి వాటితో తయారుచేసిన టీని శరీరంలోకి ఇంజెక్ట్‌ చేసుకున్నాడు. కొన్ని గంటల్లోనే.. అతడి శరీరం పసుపు రంగులోకి మారిపోయి, ఇతరులతో మాట్లాడలేని స్థితికి చేరుకున్నాడు. వివిధ పరీక్షలు చేసిన వైద్యులు అతడి రక్తంలో మ్యాజిక్‌ పుట్టగొడుగులు (సైలోసైబిన్‌) పెరుగుతున్నట్లు గుర్తించారు. ఆ పుట్టగొడుగుల్లోని బ్రెవిబసిల్లస్‌ బ్యాక్టీరియా వల్ల రక్తంలో ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ ప్రబలిందని తెలిపారు. వారం రోజుల ఐసీయూ చికిత్స సహా 22 రోజుల వైద్యం అనంతరం ఆ యువకుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. 

Updated Date - 2021-01-18T12:58:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising