ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చీమలు ఎంత పనిచేశాయో.. ఏకంగా విమానాన్నే..

ABN, First Publish Date - 2021-09-07T13:48:59+05:30

టేకాఫ్‌కు రెడీగా ఉన్న ఓ భారీ విమానాన్ని చీమలదండు నిలిపివేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విమానాన్ని నిలిపివేసిన చీమలదండు..

న్యూఢిల్లీ: టేకాఫ్‌కు రెడీగా ఉన్న ఓ భారీ విమానాన్ని చీమలదండు నిలిపివేసింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానశ్రయం నుంచి సోమవారం లండన్ వెళ్లాల్సిన ఓ ఎయిరిండియా విమానం ఇలా ఓ చీమలదండు వల్ల నిలిచిపోయింది. పైగా ఆ విమానంలో భూటాన్ యువరాజు పయనించాల్సి ఉంది. ఏఐ-111 విమానంలోని బిజినెస్ క్లాస్‌లో భారీ సంఖ్యలో చీమలు ఉండడం గమనించిన సిబ్బంది వెంటనే పైలట్లకు సమాచారం అందించడంతో చివరి నిమిషంలో విమానం ఆగిపోయింది. దానిస్థానంలో మరో విమానాన్ని అధికారులు లండన్ పంపించారు. 


వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానశ్రయం నుంచి ఎయిరిండియా విమానం ఏఐ-111 లండన్ వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. 248 మంది ప్రయాణికులు విమానం కూడా ఎక్కేశారు. ప్రయాణికుల్లో భూటాన్ యువరాజు జిగ్మే ఖేసర్ నాంగ్యెల్ వాంగ్‌చుక్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో బిజినెస్ క్లాస్‌‌లోని ప్రయాణికులు ఒక్కసారిగా గగ్గొలు పెట్టడం మొదలెట్టారు. దాంతో విమాన సిబ్బంది వెంటనే బిజినెస్ క్లాస్‌కు వెళ్లి చూసింది. వారికి అక్కడ కనిపించిన దృశ్యం చూసి నోటమాట రాలేదు. అక్కడ భారీ సంఖ్యలో చీమలు ఉన్నాయి. 


ఈ విషయాన్ని సిబ్బంది వెంటనే పైలట్లకు చేరవేసింది. దాంతో పైలట్లు విమానం టేకాఫ్‌ను ఆపేశారు. అనంతరం సిబ్బంది వెంటనే విమానంలోని 248 ప్రయాణికులను విమానం నుంచి దించేశారు. అనంతరం అధికారులు కొంత సమయం తర్వాత మరో విమానంలో ప్రయాణికులకు లండన్‌కు పంపించారు. ఈ ఘటన కారణంగా విమానంలోని ప్రయాణికులు ఏకంగా రెండు గంటల పాటు విమానాశ్రయంలోనే వేచి చూడాల్సిన పరిస్థితి దాపురించింది. ఇలా ఓ చీమలదండు ఏకంగా విమానం నిలిచిపోవడానికి కారణమైంది. 


Updated Date - 2021-09-07T13:48:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising