ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దారుణం.. దుండగుడిపై పోలీసుల కాల్పులు.. 14 ఏళ్ల బాలిక అనూహ్య మరణం!

ABN, First Publish Date - 2021-12-25T23:43:25+05:30

అమెరికాలోని లాస్ ఏంజిలిస్ నగరంలో గురువారం దారుణం జరిగింది. ఓ దుండగుడిని పట్టుకునే క్రమంలో పోలీసులు అతడిపై కాల్పులు జరపుతుండగా ప్రమాదవశాత్తూ ఓ బాలిక ఆ తూటాలకు బలైపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని లాస్ ఏంజిలిస్ నగరంలో గురువారం దారుణం జరిగింది. ఓ దుండగుడిని పట్టుకునే క్రమంలో పోలీసులు అతడిపై కాల్పులు జరుపుతుండగా ప్రమాదవశాత్తూ ఓ బాలిక ఆ తూటాలకు బలైపోయింది. ఆ సమయంలో బాలిక ఓ దుస్తుల షాపులోని డ్రెస్సింగ్‌ గదిలో ఉన్నట్టు స్థానిక మీడియా తెలిపింది. ఈ క్రమంలో గోడ లోంచి(ప్లైవుడ్‌తో నిర్మించింది) దూసుకెళ్లిన తూటా ఆ బాలిక ఛాతిలోకి చొచ్చుకుపోవడంతో ఆమె మృతి చెందింది. పోలీసులు మృతురాలిని వేలంటీనాగా గుర్తించారు. తూటా ఛాతిలోకి దూసుకుపోవడంతో ఆమె మరణించినట్టు పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. 


కాగా.. పోలీసులు వెంబడించిన నిందితుడు డేనియల్ ఎలీనా లోపేజ్(24) కూడా మృతిచెందాడు.  ఓ మహిళపై భౌతిక దాడికి పాల్పడి అతడు పారిపోతుండగా పోలీసులు అతడిపై కాల్పులు జరిపినట్టు సమాచారం. కాగా.. లాస్ ఏంజిలిస్ టైమ్స్ కథనం ప్రకారం.. ఈ ఏడు ఇప్పటివరకూ స్థానిక పోలీసులు  37 మందిపై కాల్పులు జరపగా వారిలో ఏకంగా 17 మంది మృతి చెందారు. అంతకుమునుపు ఏడాదితో పోలిస్తే.. ఘటనల సంఖ్య ఈ సంవత్సరం గణనీయంగా పెరిగిందని స్థానిక మీడియా వ్యాఖ్యానించింది. కాగా.. కాలిఫోర్నియా న్యాయశాఖ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. బాలిక మరణం చాలా విచారకరమని స్థానిక పోలీసు చీఫ్ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-12-25T23:43:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising