ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait లో అనూహ్య పరిణామం.. గత తొమ్మిదేళ్లలో ఇదే తొలిసారి!

ABN, First Publish Date - 2021-10-28T16:20:56+05:30

గల్ఫ్ దేశం కువైత్‌లో అధిక శాతం యువత ప్రభుత్వ రంగాన్ని కాదని ప్రైవేట్ ఉద్యోగాలవైపు మొగ్గుచూపుతున్నట్లు తాజాగా వెలువడిన గణంకాలు చెబుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రైవేట్‌ ఉద్యోగాలవైపు మొగ్గుచూపుతున్న అధిక శాతం కువైటీలు

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌లో అధిక శాతం యువత ప్రభుత్వ రంగాన్ని కాదని ప్రైవేట్ ఉద్యోగాలవైపు మొగ్గుచూపుతున్నట్లు తాజాగా వెలువడిన గణంకాలు చెబుతున్నాయి. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ విడుదల చేసిన నేషనల్ ఎంప్లాయిమెంట్ సెక్టార్ నివేదిక ప్రకారం ఈ ఏడాది ప్రారంభం నుంచి దేశంలోని సుమారు 53 శాతం మంది పౌరులు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేసేందుకు ఆసక్తి కనబరిచినట్లు తెలిసింది. 2021 ప్రారంభం నుంచి దాదాపు 8,537 మంది యువత ప్రవేట్ ఉద్యోగాల కోసం రిజిస్టర్ చేసుకున్నట్లు రిపోర్ట్ వెల్లడించింది. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కోరుకునే కువైటీల సంఖ్య తొమ్మిదేళ్ల క్రితంతో పోలిస్తే ఇదే అత్యధికమని, ఈ ఏడాది చివరి వరకు ఈ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.


ఇక ఈ ఏడాదిలో ఇప్పటికే 8,537 మంది కువైటీలు ప్రైవేట్ ఉద్యోగాల కోసం రిజిస్టర్ చేసుకోగా.. 2010 నుంచి 2020 మధ్య ఈ సంఖ్య కేవలం 5-7వేల మధ్య ఉందని నివేదిక తెలిపింది. ఆ సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి కనబరిచిన వారు 65శాతంగా ఉన్నట్లు తెలియజేసింది. ఇప్పుడు అనూహ్యంగా 53శాతం మంది ప్రైవేట్ రంగంవైపు మొగ్గుచూపడం విశేషం. ఇదిలా ఉంటే.. కరోనా సంక్షోభంతో పాటు సెప్టెంబరు నుండి విదేశీ స్కాలర్‌షిప్‌లపై విద్యార్థులకు భత్యం పంపిణీ చేయడంలో జాప్యం కూడా ఇలా కువైటీలు ప్రైవేట్ ఉద్యోగాల బాటపట్టేందుకు కారణమని ఆ దేశ ఉన్నత విద్యశాఖ మంత్రి డాక్టర్ మహ్మద్ అల్ ఫారెస్ వెల్లడించారు.  


Updated Date - 2021-10-28T16:20:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising