ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత కమర్షియల్ విమానాలకు కువైత్ గ్రీన్‌సిగ్నల్!

ABN, First Publish Date - 2021-08-20T01:56:42+05:30

భారత్ నుంచి కమర్షియల్ విమానాలకు గల్ఫ్ దేశం కువైత్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే, మంత్రివర్గ కమిటీ నిర్ధేశించిన కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాలని బుధవారం ఆ దేశ కేబినెట్ తన ప్రకటనలో పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: భారత్ నుంచి కమర్షియల్ విమానాలకు గల్ఫ్ దేశం కువైత్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే, మంత్రివర్గ కమిటీ నిర్ధేశించిన కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాలని బుధవారం ఆ దేశ కేబినెట్ తన ప్రకటనలో పేర్కొంది. భారత్‌తో పాటు బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్, ఈజిప్ట్ నుంచి కూడా విమాన సర్వీసులు ప్రారంభిస్తామని మంత్రిమండలి వెల్లడించింది. దీంతో త్వరలోనే భారత్, కువైత్ మధ్య విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇక కరోనా సెకండ్ వేవ్ సమయంలో వైద్య నిపుణుల సూచనల మేరకు భారత్‌ సహా ఇతర దేశాల విమాన సర్వీసులపై కువైత్ నిషేధం విధించింది. ఏప్రిల్ నుంచి ఈ బ్యాన్ కొనసాగుతోంది. తాజా ప్రకటనతో ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులకు మార్గం సుగమమైంది. ఇక ఈ నెల 5వ తేదీ నుంచి యూఏఈ కూడా భారత ప్రయాణికులపై బ్యాన్‌ను తొలగించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-08-20T01:56:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising