ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రవాసుల రెసిడెన్సీ పర్మిట్ల పునరుద్ధరణపై కువైట్ కీలక నిర్ణయం!

ABN, First Publish Date - 2021-04-02T13:43:54+05:30

ప్రవాసుల రెసిడెన్సీ పర్మిట్స్ పునరుద్ధరణపై కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ బుధవారం కీలక ప్రకటన చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైట్ సిటీ: ప్రవాసుల రెసిడెన్సీ పర్మిట్స్ పునరుద్ధరణపై కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ బుధవారం కీలక ప్రకటన చేసింది. ఆర్టికల్ 19 ద్వారా ప్రవాసుల రెసిడెన్సీ పర్మిట్ల పునరుద్ధరణ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇన్వెస్టర్ రెసిడెన్సీ కలిగి ఉన్న ప్రవాసులతో పాటు విదేశీ బిజినెస్ భాగస్వామ్యంలో లక్ష కువైటీ దినార్లకు తగ్గకుండా వాటా కలిగి ఉన్నవారికి మాత్రమే ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఇక ఇటీవల వర్క్ పర్మిట్ల బదిలీలను ప్రారంభించిన పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(పీఏఎం) ప్రవాసులు ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్‌లో పనిచేస్తున్నారో వారు తమ వర్క్ పర్మిట్లను ప్రైవేట్ సెక్టార్లకు మార్చుకోవాలని ప్రకటించిన విషయం తెలిసిందే.


ఈ సందర్భంగా డిపెండెంట్ వీసాతో సహా మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీలు, ప్రభుత్వ సంస్థలలో పనిచేసే వారు తమ వర్క్ పర్మిట్లను బదిలీ చేసుకోవడానికి అర్హులు అని పీఏఎం తన ప్రకటనలో పేర్కొంది. కాగా, ప్రభుత్వ కాంట్రాక్టులలో మరియు చిన్న, మధ్యతరహా సంస్థలలో(SMEs) పనిచేసే వారు తమ వీసాలను బదిలీ చేయడానికి అర్హులు కాదని స్పష్టం చేసింది. అలాగే ప్రస్తుతం కువైట్‌లో ఉన్న ప్రవాసులు మాత్రమే ఇలా వర్క్ పర్మిట్లను బదిలీ చేసుకునే వీలు ఉంది. దీనికి తమ మునుపటి యజమానుల అనుమతి తప్పనిసరి అని పీఏఎం స్పష్టం చేసింది. అంతేగాక 60 ఏళ్లకు పైబడిన, ఎలాంటి హైస్కూల్ డిగ్రీలేని ప్రవాసులు తమ రెసిడెన్సీ పర్మిట్లను పునరుద్ధరించుకునేందుకు వీలు లేదని తెలియజేసింది.   

Updated Date - 2021-04-02T13:43:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising