ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశానికి వచ్చే, ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులకు Kuwait ప్రత్యేక నిబంధనలు

ABN, First Publish Date - 2021-12-25T14:49:37+05:30

కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ నేపథ్యంలో కువైత్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు నడిపించే విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తాజాగా ప్రత్యేక సర్క్యూలర్ జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ నేపథ్యంలో కువైత్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు నడిపించే విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తాజాగా ప్రత్యేక సర్క్యూలర్ జారీ చేసింది. మంత్రి మండలి సూచన మేరకు కువైత్ వచ్చే, అక్కడి నుంచి ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలను ఈ సర్క్యూలర్ పొందుపరిచింది. దీని ప్రకారం దేశ పౌరులు ఎవరైతే రెండో డోసు కరోనా వ్యాక్సిన్ తీసుకుని తొమ్మిది నెలలు గడుస్తున్నాయో వారు బూస్టర్ డోసు తీసుకోకపోతే దేశం నుంచి బయటకు ప్రయాణించకూడదు. 2022 జనవరి 2 నుంచి ఈ నిబంధన అమలులోకి రానుంది. 


అలాగే విమానాశ్రయానికి వచ్చేవారు తప్పనిసరిగా పీసీఆర్ టెస్టుకు సంబంధించిన నెగెటివ్ సర్టిఫికేట్ చూపించాలి. అది కూడా 48 గంటల ముందు టెస్టు చేయించినదే ఉండాలి. బయటి దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు 10 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండడం తప్పనిసరి. దీంతో పాటు క్వారంటైన్ పీరియడ్ ముగియడానికి 72 గంటల ముందు మరోసారి తప్పకుండా కరోనా పరీక్ష చేయించుకోవాలి. కరోనా టీకాకు సంబంధించిన సర్టిఫికేట్ చూపించడం కూడా తప్పనిసరి. ఈ వ్యాక్సిన్ సర్టిఫికేట్‌లోని పేరు ట్రావెల్ డాక్యుమెంట్స్‌లో ఉన్న పేరుతో మ్యాచ్ కావాలి. ఏ టీకా తీసుకున్నారు, ఏఏ తేదీల్లో తీసుకున్నారు తదితర వివరాలు ఆ సర్టిఫికేట్‌లో ఉండాలి. ఇంకా సర్టిఫికేట్‌పై క్యూఆర్ కోడ్ ఉండడం తప్పనిసరి. ఒకవేళ క్యూఆర్ కోడ్ లేకుంటే ఆ సర్టిఫికేట్‌ను ప్రభుత్వ గుర్తింపు కోసం ఆరోగ్యశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం మరిచిపోవద్దు. ఈ నిబంధనలు కువైత్ వచ్చే వారికి డిసెంబర్ 26 నుంచి అమలు చేయనున్నట్లు సర్క్యూలర్‌లో డీజీసీఏ పేర్కొంది.    


Updated Date - 2021-12-25T14:49:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising