ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాకిస్తాన్ సహా 7 దేశాల వారికి Visa లపై పరిమితి విధించిన Kuwait..

ABN, First Publish Date - 2021-11-05T17:03:58+05:30

కరోనా తగ్గుముఖం పట్టడంతో గత నెలలో కువైత్ విదేశీయుల రాకపై నిషేధాన్ని ఎత్తివేసింది. అది కూడా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారిని మాత్రమే దేశంలోకి ప్రవేశించడానికి అనుమతి ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: కరోనా తగ్గుముఖం పట్టడంతో గత నెలలో కువైత్ విదేశీయుల రాకపై నిషేధాన్ని ఎత్తివేసింది. అది కూడా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారిని మాత్రమే దేశంలోకి ప్రవేశించడానికి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో వివిధ రకాల వీసాల కోసం దరఖాస్తులు సైతం ప్రారంభించింది. అయితే, పాకిస్తాన్ సహా ఏడు దేశాల వారికి మాత్రం వీసాలపై పరిమితి విధించింది. ఈ ఏడు దేశాల పౌరులు కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ అనుమతి లేకుండా వీసాలు పొందడానికి వీల్లేదు. తప్పనిసరిగా మంత్రిత్వశాఖ అనుమతి తీసుకోవాల్సిందే. ఇలా ఎందుకు పరిమితి విధించడం జరిగిందనే దానిపై ఇప్పటికైతే కువైత్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఈ ఏడు దేశాల జాబితాలో పాక్‌తో పాటు బంగ్లాదేశ్, ఇరాక్, ఇరాన్, యేమెన్, సిరియా, సుడాన్ ఉన్నాయి. ఈ దేశాలకు చెందిన వారు కమర్షియల్, వర్క్, డిపెండెన్సీ తదితర వీసాలు తీసుకోవాలంటే తప్పనిసరిగా కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ అనుమతి ఉండాల్సిందే. 


ఇదిలా ఉంటే.. కువైత్‌లో ఎంట్రీ కోసం ఆ దేశ అంతర్గత మంత్రిత్వశాఖ ఇటీవల వీసాలు జారీ ప్రక్రియను తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. అది కూడా కేవలం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే వీసాలు ఇస్తోంది. అలాగే వీసాల జారీలో మంత్రిత్వశాఖ కొన్ని షరతులు విధించింది. నాన్ రెసిడెంట్లకు టూరిస్ట్ వీసాలు ప్రస్తుతం జారీ చేయడం లేదు. అలాగే ఫ్యామిలీ వీసాల విషయానికి వస్తే.. భార్య, 16 ఏళ్లలోపు చిన్నారులకు మాత్రమే వీసాలు జారీ చేయనున్నట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది. అంతేగాక ఈ వీసా కోసం శాలరీ కండిషన్ కూడా పెట్టింది.


వర్క్‌ పర్మిట్‌లో 500 కువైటీ దినార్లు(రూ.1.23లక్షలు) ఉన్నవారికి మాత్రమే ఫ్యామిలీ వీసా మంజూరు చేయనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇక వీసా కోసం దరఖాస్తు చేసే సమయంలో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్(క్యూఆర్ కోడ్‌తో ఉన్నది) సమర్పించడం తప్పనిసరి. ఇకపోతే కమర్షియల్ విజిట్ వీసాలు, గవర్నమెంట్ విజిట్ మరియు ఈ-వీసాలు(ప్రస్తుతం 53 దేశాల వారికి) జారీ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ సర్వీస్ పోర్టల్ ద్వారా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ ఎంట్రీ వీసాలు, వర్క్ పర్మిట్లను జారీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది.  


Updated Date - 2021-11-05T17:03:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising