ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

700 మంది విదేశీ టీచర్లకు Kuwait ఎంట్రీ వీసాలు..

ABN, First Publish Date - 2021-10-17T15:19:21+05:30

మహమ్మారి కరోనా నేపథ్యంలో ప్రయాణ ఆంక్షల కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన సుమారు 700 మంది విదేశీ టీచర్లకు తాజాగా కువైత్ ఎంట్రీ వీసాలు మంజూరు చేసినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: మహమ్మారి కరోనా నేపథ్యంలో ప్రయాణ ఆంక్షల కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన సుమారు 700 మంది విదేశీ టీచర్లకు తాజాగా కువైత్ ఎంట్రీ వీసాలు మంజూరు చేసినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. విద్యా, అంతర్గత మంత్రిత్వ శాఖలు జారీ చేసిన ఈ వీసాలతో ఇప్పటికే కొంతమంది ఉపాధ్యయులు కువైత్ చేరుకున్నట్లు సమాచారం. విధుల్లో చేరడానికి ముందే వీరికి మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు. ఆ టెస్టుల ఫలితాలను బట్టి వారిని తిరిగి విధుల్లో చేరడానికి అనుమతి లభిస్తుంది. ఒకవేళ ఈ మెడికల్ టెస్టుల్లో ఫెయిల్ అయితే వారి కాంట్రాక్ట్ రద్దు చేయబడుతుంది. అలాగే దేశం నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు వెల్లడించారు.  



ఇక అక్టోబర్ నుంచి కువైత్‌లోని పాఠశాలలు తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థులను నేరుగా తరగతి గదులకు హాజరయ్యేందుకు వీలు కల్పించారు. అలాగే దాదాపు ఏడు నెలల బ్యాన్ తర్వాత ప్రవాసుల ఎంట్రీకి కువైత్ అనుమతి ఇచ్చింది. ఆగస్టు 1 నుంచి ప్రయాణ ఆంక్షలను తొలగించింది. ఆమోదం పొందిన కరోనా టీకాను రెండు డోసులు వేసుకున్న ప్రవాసులు తిరిగి కువైత్ వెళ్లేందుకు అర్హులు. ఫైజర్-బయోఎన్‌టెక్, ఆక్స్‌ఫర్డ్, మొడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లు  ఆమోదం పొందిన జాబితాలో ఉన్నాయి. కాగా, సినోఫార్మ్, సినోవాక్, స్పుత్నిక్ టీకాలు తీసుకున్న ప్రయాణికులు మాత్రం కువైత్ గుర్తించిన వ్యాక్సిన్లలో మూడో డోస్ తీసుకుంటే మాత్రమే దేశంలోకి ప్రవేశించవచ్చు.

Updated Date - 2021-10-17T15:19:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising