ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డొమెస్టిక్ వ‌ర్క‌ర్ల ఎంట్రీ వీసా గ‌డువు పెంచిన కువైట్‌

ABN, First Publish Date - 2021-05-13T14:10:07+05:30

గ‌ల్ఫ్ దేశం కువైట్ డొమెస్టిక్ వ‌ర్క‌ర్ల విష‌యంలో తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వారి ఎంట్రీ వీసా గ‌డువును మూడు నెల‌ల నుంచి ఆరు నెల‌ల‌కు పెంచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైట్ సిటీ: గ‌ల్ఫ్ దేశం కువైట్ డొమెస్టిక్ వ‌ర్క‌ర్ల విష‌యంలో తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వారి ఎంట్రీ వీసా గ‌డువును మూడు నెల‌ల నుంచి ఆరు నెల‌ల‌కు పెంచింది. ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణ‌యానికి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణ‌యంతో ఇక‌పై వ‌ర్క‌ర్ల రెసిడెన్సీ ప‌ర్మిట్ గ‌డువు వారి పాస్‌పోర్టుల్లో రెండు ఏళ్ల‌కు బ‌దులు 18 నెల‌లుగా ప్రింట్ కానుందని కువైట్ డొమెస్టిక్ లేబ‌ర్ యూనియ‌న్ హెడ్ ఖ‌లీద్ అల్ ద‌ఖ్న‌న్ వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. దీనివ‌ల్ల వేలాది మంది విదేశీ వ‌ర్క‌ర్ల‌కు మేలు క‌లుగుతుంద‌ని ఖ‌లీద్ పేర్కొన్నారు. ఇక భార‌త్‌లో కొన‌సాగుతున్న‌ మ‌హ‌మ్మారి క‌రోనా క‌ల్లోలం కార‌ణంగా గ‌త నెల నుంచి భార‌త విమానాల‌పై కువైట్ నిషేధం విధించిన సంగ‌తి తెలిసిందే. దీంతో చాలా మంది వివిధ కార‌ణాల‌తో భార‌త్‌కు వ‌చ్చి ఇక్క‌డే చిక్కుకుపోయారు.      

Updated Date - 2021-05-13T14:10:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising