ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait లో ఒక వారం వ్యవధిలోనే 662 మంది ప్రవాసుల దేశ బహిష్కరణ!

ABN, First Publish Date - 2021-10-27T19:43:36+05:30

గల్ఫ్ దేశం కువైత్ గత కొంతకాలంగా చట్ట విరుద్ధంగా దేశంలో ఉంటున్న ప్రవాసులపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. రెసిడెన్సీ గడువు ముగిసిన ఇంకా కువైత్‌లోనే ఉంటున్న వలసదారులను గుర్తించి వారి దేశాలకు పంపిస్తున్నారు సంబంధిత అధికారులు. అలాగే ఇతర ఉల్లంఘనలకు పాల్పడిన వారిని కూడా కువైత్ దేశం నుంచి బహిష్కరిస్తోంది. ఇలా గడిచిన వారం రోజుల్లోనే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ గత కొంతకాలంగా చట్ట విరుద్ధంగా దేశంలో ఉంటున్న ప్రవాసులపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. రెసిడెన్సీ గడువు ముగిసిన ఇంకా కువైత్‌లోనే ఉంటున్న వలసదారులను గుర్తించి వారి దేశాలకు పంపిస్తున్నారు సంబంధిత అధికారులు. అలాగే ఇతర ఉల్లంఘనలకు పాల్పడిన వారిని కూడా కువైత్ దేశం నుంచి బహిష్కరిస్తోంది. ఇలా గడిచిన వారం రోజుల్లోనే ఏకంగా 600 మందికి పైగా ప్రవాసులను దేశం నుంచి వెళ్లగొట్టింది. ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు సుమారు 662 మంది వలసదారులను దేశం నుంచి బహిష్కరించింది. వీరందరూ వివిధ ఉల్లంఘనలకు పాల్పడినట్లు అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీరిలో 447 మంది పురుషులు, 215 మంది మహిళలు ఉన్నట్లు తెలిపింది. 


అంతర్గత మంత్రిత్వశాఖ మంత్రి షేక్ థమేర్ అలీ సభా అల్ సలేం అల్ సభా, మంత్రిత్వశాఖ అండర్‌సెక్రెటరీ లెఫ్టినెంట్ జనరల్ షేక్ ఫైజల్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబేర్ అల్ సభా సూచనల మేరకు సంబంధిత అధికారులు ఉల్లంఘనలకు పాల్పడిన 662 మంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించారు. ఇదిలాఉంటే.. ఇటీవల దేశవ్యాప్తంగా అంతర్గత మంత్రిత్వశాఖ నిర్వహించిన తనిఖీల్లో భారీ మొత్తంలో వలసదారులు చట్ట విరుద్ధంగా దేశంలో నివసిస్తున్నట్లు తేలింది. వీరిలో చాలా మందికి రెసిడెన్సీ గడువు ముగిసినట్లు అధికారులు గుర్తించారు. దీనిలో భాగంగానే ఇటీవల కువైత్ నుంచి భారీ సంఖ్యలో ప్రవాసుల దేశ బహిష్కరణ జరుగుతోంది.   

Updated Date - 2021-10-27T19:43:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising