ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గృహ కార్మికులకు Kuwait ఝలక్.. అమల్లోకి కొత్త నిబంధన.. ఏకంగా రెసిడెన్సీకే ఎసరు!

ABN, First Publish Date - 2021-12-19T13:48:15+05:30

గల్ఫ్ దేశం కువైత్ తాజాగా గృహ కార్మికుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ తాజాగా గృహ కార్మికుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు నెలలకు మించి దేశం వెలుపల ఉంటే రెసిడెన్సీ పర్మిట్లను క్యాన్సిల్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రెసిడెన్సీ అఫైర్స్ సెక్టార్ కీలక ప్రకటన చేసింది. ఆరు నెలలు దాటి దేశం బయట ఉన్న గృహ కార్మికుల నివాస పర్మిట్లు ఆటోమెటిక్‌ క్యాన్సిల్ అవుతాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. 2021 డిసెంబర్ 1వ తేదీ నుంచి ఆరు నెలల కాల పరిమితిని లెక్కించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం దేశంలో మునుపటిలా సాధారణ జీవనం, ఆరోగ్య స్థిరత్వం నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతకుముందు కరోనా మహమ్మారి పరిణామాల కారణంగా ఆరు నెలలకు పైగా దేశం వెలుపల ఉన్నవారికి ఆటోమెటిక్‌గా రెసిడెన్సీ రద్దు నిలిపివేయబడింది. అయితే, గృహ కార్మికుల నివాసాన్ని ఆరు నెలల కంటే ఎక్కువ కాలం కొనసాగించాలనుకునే పౌరులు ఆరు నెలల వ్యవధి ముగిసేలోపు ప్రత్యేకంగా అనుమతి కోసం అభ్యర్థించుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. ఇక ఇప్పటికే పనిమనుషుల కొరతతో సతమతమవుతున్న కువైటీలకు ఈ నిర్ణయం మరింత అవరోధంగా మారే అవకాశం లేకపోలేదు. 

Updated Date - 2021-12-19T13:48:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising