ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రవాసులకు డ్రైవింగ్ లైసెన్స్.. Kuwait మరో సంచలన నిర్ణయం!

ABN, First Publish Date - 2021-10-01T14:50:30+05:30

వలసదారులకు డ్రైవింగ్ లైసెన్సుల జారీ విషయమై తాజాగా కువైత్ మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: వలసదారులకు డ్రైవింగ్ లైసెన్సుల జారీ విషయమై తాజాగా కువైత్ మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులేస్తోంది. అంతర్గత మంత్రిత్వశాఖ అండర్ సెక్రెటరీ లెఫ్టినెంట్ జనరల్ షేక్ ఫైజల్ అల్ నవాఫ్, ప్రవాసులకు డ్రైవింగ్ లైసెన్సుల జారీని పరిమితం చేయడానికి సంబంధించి నివేదిక ఇవ్వాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. వచ్చే ఆదివారం నుంచి అరబిక్ స్కూల్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ అంశాలపై నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 


ఈ సందర్భంగా అల్ అహ్మది గవర్నరేటు పరిధిలోని జనరల్ ట్రాఫిక్ విభాగాన్ని ఆయన పరిశీలించారు. కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. క్షేత్ర భద్రతా విభాగాలు విద్యా సంవత్సరానికి తమ సన్నాహాలను పూర్తి చేశాయని నొక్కిచెప్పారు. అలాగే అన్ని ప్రధాన, సెకెండరీ రోడ్లపై ట్రాఫిక్ విషయమై తమ విభాగం అప్రమత్తంగా ఉందని అల్ నవాఫ్ చెప్పారు.  


Updated Date - 2021-10-01T14:50:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising