ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait వెళ్లాలనుకుంటున్న వారికి గుడ్‌న్యూస్!

ABN, First Publish Date - 2021-10-08T13:04:30+05:30

మహమ్మారి కరోనా ప్రభావం రోజురోజుకీ తగ్గుముఖం పడుతుండడంతో కువైత్ నెమ్మదిగా సాధారణ జీవనంవైపు అడుగులేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: మహమ్మారి కరోనా ప్రభావం రోజురోజుకీ తగ్గుముఖం పడుతుండడంతో కువైత్ నెమ్మదిగా సాధారణ జీవనంవైపు అడుగులేస్తోంది. గడిచిన కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా కొత్త కేసులు తగ్గడంతో పాటు రికవరీలు పెరిగాయి. అలాగే మరణాలు జీరోకు చేరుకున్నాయి. దీంతో ఇప్పటికే పలు సడలింపులు ఇచ్చింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కరోనా ఆంక్షలు తొలగించిన తర్వాత కువైత్ ఇటీవల ఎయిర్‌పోర్టుకు డైలీ రావాల్సిన ప్రయాణికుల సామర్థ్యాన్ని 10వేలకు పెంచిన విషయం తెలిసిందే. అయితే, 10వేలుగా ఉన్న ఈ రోజువారీ ప్రయాణికుల సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం సమ్మర్ హాలీడేస్ ముగించుకుని స్వదేశానికి తిరిగి వస్తున్న దేశ పౌరులు కూడా భారీ సంఖ్యలో ఉంటున్నారు. 


అలాగే ఇటీవల విదేశీ ప్రయాణికుల రాకపై ఉన్న నిషేధాన్ని కూడా తొలిగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎయిర్‌పోర్టు సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం కువైత్‌లో 80 శాతం మంది ఒక డోసు, 75 శాతం మందికి రెండు మోతాదుల వ్యాక్సినేషన్ పూర్తైనట్లు అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. అందుకే వీలైనంత త్వరగా విమానాశ్రయానికి వచ్చే రోజువారీ ప్రయాణికుల సంఖ్యను పెంచే యోచనలో కువైత్ సర్కార్ ఉంది. అటు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ భారత్ నుంచి కువైత్‌కు వచ్చే ప్రయాణికుల కోటాను కూడా పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం వీక్లీ కువైత్‌కు 5,528 మంది భారతీయ ప్రయాణికులు వెళ్లేందుకు మాత్రమే వీలుంది. 

Updated Date - 2021-10-08T13:04:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising