ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రచయితలో మానవత్వంతోపాటు మాతృత్వం ఉండాలి: భువనచంద్ర

ABN, First Publish Date - 2021-07-20T00:53:49+05:30

ఒక రచయితలో మానవత్వంతోపాటు మాతృత్వం కూడా ఉండాలని ప్రముఖ రచయిత భువచంద్ర అన్నారు. కొత్త (కరోనా) కథలు-4 కథా సంకలనానికి ఆర్థిక సహకారం అందించిన డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి (డల్లాస్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక రచయితలో మానవత్వంతోపాటు మాతృత్వం కూడా ఉండాలని ప్రముఖ రచయిత భువచంద్ర అన్నారు. కొత్త (కరోనా) కథలు-4 కథా సంకలనానికి ఆర్థిక సహకారం అందించిన డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి (డల్లాస్)కి ధన్యవాదాలు తెలిపేందుకు 7 దేశాలకు చెందిన 80 మంది రచయితలు, ఇతర ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సమావేశం అయ్యారు. 



ఈ సందర్భంగా భువనచంద్ర మాట్లాడారు. ఒక రచయితలో మానవత్వంతోపాటు మానవత్వం కూడా ఉండాలన్నారు. ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాలని తెలిపారు. ప్రకృతి నుంచి మనం అన్నీ తీసుకుంటున్నాం.. కానీ తిరిగి ఏమీ ఇవ్వడంలేదు అన్నారు. 80 మంది ర‌చ‌యిత‌ల క‌థ‌ల‌ను ఒకే పుస్తకంలో ముద్రించ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు. ఈ పుస్తకాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేసిన శ్రీనివాస్ రెడ్డి, రామ‌రాజులకు భువ‌న చంద్ర ధ‌న్యవాదాలు తెలియచేశారు. అనంతరం యండ‌మూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ.. తన ఆరోగ్యం సహకరించకపోయినా కార్యక్రమంలో పాల్గొన్నట్టు చెప్పారు. అంతేకాకుండా రచయితలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కాగా.. యండమూరి వీరేంద్రనాథ్‌ని గొప్ప మానవతావాదిగా రామరాజు అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో కామేశ్వరి, డాక్టర్‌ కేవీ కృష్ణకుమారి, డాక్టర్‌ డా. తెన్నేటి సుధా దేవి, అత్తలూరి విజయలక్ష్మి, ముక్తేవి భారతి, పొత్తూరి విజయలక్ష్మి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. 




Updated Date - 2021-07-20T00:53:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising