ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొరపాటున 2లక్షల విలువైన పుల్ల ఐస్‌లు ఆర్డర్ ఇచ్చిన చంటోడు!

ABN, First Publish Date - 2021-05-09T04:14:54+05:30

అమెరికాలో ఒక వింత ఘటన జరిగింది. ఒక నాలుగేళ్ల పిల్లాడు పొరపాటున దాదాపు రూ.2లక్షల రూపాయలకు పుల్ల ఐస్‌క్రీంలు ఆర్డర్ ఇచ్చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రూక్లిన్: అమెరికాలో ఒక వింత ఘటన జరిగింది. ఒక నాలుగేళ్ల పిల్లాడు పొరపాటున దాదాపు రూ.2లక్షల రూపాయలకు పుల్ల ఐస్‌క్రీంలు ఆర్డర్ ఇచ్చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బ్రూక్లిన్‌కు చెందిన ఈ చంటోడికి స్పాంజ్‌బాబ్ అనే కార్టూన్ కేరక్టర్ ఆకారంలో ఉండే (పాప్సికిల్స్) పుల్ల ఐస్‌లు అంటే చాలా ఇష్టం. వాటిని అమెజాన్‌లో ఆర్డర్ ఇచ్చుకుందామని అనుకున్నాడు. అదే చేశాడు. కానీ ఎన్ని ఐస్‌లు కావాలనే దెగ్గర తప్పు చేసేశాడు. మొత్తమ్మీద 2,618 డాలర్ల (మన లెక్కల్లో రూ.1.91 లక్షల)కు ఐస్‌క్రీంలు ఆర్డర్ ఇచ్చాడు. అవి ఆ పిల్లాడి ఆంట్ ఇంటికి డెలివరీ వచ్చేశాయి.


అసలు విషయం తెలసుకున్న ఇంటిలోని పెద్దవారు.. ఆర్డర్ వెనక్కు ఇచ్చేయాలని చూశారు. అయితే అమెజాన్ దానికి నిరాకరించింది. దీంతో ఏం చేయాలో తెలియని ఆ పిల్లాడి తల్లిదండ్రులు ఈ బిల్లుకట్టడం కోసం గోఫండ్‌మీ ఖాతా ఏర్పాటు చేశారు. విషయం తెలిసిన చాలా మంది సాయం చేయడంతో 14,971 డాలర్లు వచ్చాయి. ఈ బిల్లు చెల్లించగా మిగిలిన సొమ్మును పిల్లాడి చదువు కోసం ఉపయోగిస్తారని సమాచారం.

Updated Date - 2021-05-09T04:14:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising