ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

233 ఏళ్ల న్యూయార్క్ రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం!

ABN, First Publish Date - 2021-08-12T00:31:49+05:30

లైంగిక వేధింపుల కేసులో అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ క్యూమో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన కనీసం 11 మంది మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఎంక్వయిరీ ప్యానెల్ తేల్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్: లైంగిక వేధింపుల కేసులో అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ క్యూమో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన కనీసం 11 మంది మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఎంక్వయిరీ ప్యానెల్ తేల్చింది. ఈ క్రమంలోనే గవర్నర్ పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు క్యూమో మంగళవారం ప్రకటించారు. 14 రోజుల్లో ఆయన రాజీనామా ఆమోదించబడుతుంది. ఈ నేపథ్యంలో న్యూయార్క్ తదుపరి గవర్నర్‌‌పై చర్చ మొదలైంది. అయితే, న్యూయార్క్ తదుపరి గవర్నర్‌గా క్యూమో వద్ద లెఫ్టినెంట్ గవర్నర్‌గా విధులు నిర్వహించిన కాథీ హోచుల్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. దీంతో 233 ఏళ్ల న్యూయార్క్ రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం నమోదుకానుంది. న్యూయార్క్ మొదటి మహిళా గవర్నర్‌గా ఆమె చరిత్రకెక్కనున్నారు.


ఇక క్యూమో నాలుగేళ్ల గవర్నర్ పదవీకాలం 2022 డిసెంబర్‌తో ముగియనుంది. అప్పటివరకు 62 ఏళ్ల కాథీ గవర్నర్‌గా విధులు నిర్వహించనున్నారు. "క్యూమో గవర్నర్ పదవికి రాజీనామా చేయడం సరియైందే. ఆయనపై వచ్చిన ఆరోపణలు రాష్ట్ర ప్రజలను కూడా బాధించాయి. దాంతో వారు సైతం ఆయన రాజీనామా చేయాలని కోరుకున్నారు. ఇప్పుడు అదే జరిగింది. నేను న్యూయార్క్ 57వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాను" అని కాథీ ట్వీట్ చేశారు. 2015, జనవరి 1న ఆమె న్యూయార్క్ రాష్ట్ర 77వ లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. కాథీని 2014, నవంబర్ 4న క్యూమో లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించడం జరిగింది. అంతకుముందు ఆమె 2011-13 మధ్య న్యూయార్క్ 26వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి కాంగ్రెస్ చట్టసభ్యురాలిగా కొనసాగారు. 

Updated Date - 2021-08-12T00:31:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising