ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లెఫ్టినెంట్ గవర్నర్ బరిలో భారతీయుడు.. మద్దతు తెలిపిన కపిల్ దేవ్

ABN, First Publish Date - 2021-04-06T19:57:23+05:30

రిపబ్లికన్ పార్టీ తరఫున వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ బరిలో ఉన్న భారత సంతతి వ్యక్తి పునీత్ అహ్లూవాలియాకు భారత క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ మద్దతు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ బరిలో ఉన్న భారత సంతతి వ్యక్తి పునీత్ అహ్లూవాలియాకు భారత క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ మద్దతు తెలిపారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో పునీత్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతూ కపిల్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. నేను వచ్చి మీకు సహాయం చేయాలని ఆశిస్తున్నాను అంటూ వీడియోలో కపిల్ అన్నారు. తనకు మద్దతు తెలిపిన కపిల్ దేవ్‌కు ఈ సందర్భంగా పునీత్ ధన్యవాదాలు తెలియజేశారు. తన మిత్రుడు, గ్రేట్ క్రికెటర్ తనకు మద్దతు తెలపడం చాలా ఆనందంగా ఉందని పునీత్ చెప్పుకొచ్చారు. కాగా, రిపబ్లికన్ పార్టీ మే 8న జరిగే హైబ్రిడ్ సదస్సులో లెఫ్టినెంట్ గవర్నర్‌కు నామినీని ఎంపిక చేయనుంది. ఒకవేళ పునీత్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎంపికైతే వర్జీనియా రాష్ట్రంలో అత్యున్నత పదవి పొందిన తొలి భారతీయ అమెరికన్‌గా రికార్డుకెక్కుతారు. ఇక ఢిల్లీకి చెందిన 55 ఏళ్ల పునీత్ 1990లో అమెరికాకు వలస వెళ్లారు. ఆయన భార్య నదియాది ఆఫ్గనిస్తాన్. కాగా, 2010లో భారతీయ అమెరికన్లు అత్యధికంగా ఉన్న అమెరికా రాష్ట్రాల్లో వర్జీనియాది ఏడో ర్యాంక్. అలాగే యూనివర్శిటీ ఆఫ్ వర్జీనియా నివేదిక ప్రకారం హాఫ్ మిలియన్ కంటే ఎక్కువ మంది ఆసియన్ అమెరికన్లు ఉన్నట్లు సమాచారం.  

Updated Date - 2021-04-06T19:57:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising