ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధ్యక్షుడి అతిథి గృహంలో కమలా హారిస్ కుటుంబం!

ABN, First Publish Date - 2021-01-25T22:42:51+05:30

అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన మొదటి మహిళగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. కాగా.. ప్రస్తుతం ఆమె తనకు కేటాయించిన అధికారిక నివాస భవనంలో ఉం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన మొదటి మహిళగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. కాగా.. ప్రస్తుతం ఆమె తనకు కేటాయించిన అధికారిక నివాస భవనంలో ఉండట్లేదు. దీనికి ఓ పెద్ద కారణమే ఉంది. దీన్ని కమలా హారిస్ ముఖ్య అధికార ప్రతినిధి వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికా ఉపాధ్యక్ష పదవీబాధ్యతలు స్వీకరించిన తర్వాత కమలా హారిస్.. ఆమెకు కేటాయించిన అధికార భవనంలో ఉండకుండా తన కుటుంబంతో సహా ప్రెసిడెంట్ అతిథిగృహంలో నివాసం ఉంటున్నట్టు సిమోన్ సాండర్స్ వెల్లడించారు.


శ్వేతసౌధానికి వాయువ్యంగా నాలుగు మైళ్ల దూరంలో నావల్ అబ్జర్వేటరీ కాంప్లెక్స్‌లోని వైస్ ప్రెసిడెంట్ అధికార నివాసంలో మరమ్మత్తులు జరుగుతున్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే కమలా హారిస్ తన కుటుంబంతో సహా బ్లెయిర్ హౌస్‌లో నివాసం ఉంటున్నట్టు పేర్కొన్నారు. దీంతో బ్లెయిర్ హౌస్ ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ అధికార నివాసంగా మారిపోయినట్టు చెప్పారు. కాగా.. బ్లెయిర్ హౌస్‌ను 1824లో నిర్మించారు. 1942 నుంచి దీన్ని అమెరికా అధ్యక్షుడి అతిథి గృహంగా మార్చారు. సాధారణంగా ఇందులో అమెరికాలో పర్యటించే ఇతర దేశాధినేతలు బస చేస్తుంటారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ భవనంలో బస చేశారు. 


Updated Date - 2021-01-25T22:42:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising