ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం

ABN, First Publish Date - 2021-01-21T03:54:46+05:30

అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ కొద్ది నిమిషాల క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు జస్టిస్ సోనియా సొటోమేయర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ కొద్ది నిమిషాల క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు జస్టిస్ సోనియా సొటోమేయర్ కమలా హ్యారిస్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం ముందు హాలీవుడ్ సింగర్ లేడీ గాగా అమెరికా జాతీయ గీతాన్ని ఆలపించారు. గోల్డెన్ మైక్‌లో ఆమె ఆలపించడం అందరిని ఆకట్టుకుంది. అమెరికా చరిత్రలోనే మొట్టమొదటి ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన మహిళగా కమలా హ్యారిస్ సరికొత్త చరిత్రను సృష్టించారు. కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం జరిగిన కొద్ది నిమిషాల తర్వాత జో బైడెన్ 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.


ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కమలా హ్యారిస్ చీరకట్టులో కనిపిస్తారని అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఆమె చీరలో కాకుండా పర్పుల్ కలర్(వంకాయ రంగు) డ్రెస్ వేసుకున్నారు. కమలా హ్యారిస్ ఈ రంగు దుస్తులు వేసుకోవడం వెనుక పెద్ద కారణమే ఉంది. కమలా హ్యారిస్ గతంలో అధ్యక్ష పదవికి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రచారం సందర్భంగా కూడా ఆమె పర్పుల్ కలర్ దుస్తులనే ధరించారు. ఈ రంగు దుస్తులను ధరించడం వెనుక కారణం ఏంటంటే.. దశాబ్దాల క్రితం షిర్లే క్రిషోల్మ్ అనే నల్ల జాతి మహిళ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. తన రాజకీయ జీవితానికి షిర్లేనే స్ఫూర్తి అని కమలా హ్యారిస్ చెబుతారు. షిర్లేకు గుర్తుగా కమలా హ్యారిస్ ఈ పర్పుల్ కలర్ దుస్తులను ధరించారు. కాగా.. బైడెన్- కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, జార్జ్ బుష్, మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. 

Updated Date - 2021-01-21T03:54:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising