ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాణ స్వీకారానికి ముందు కమల హ్యారిస్ ఆసక్తికర ట్వీట్ !

ABN, First Publish Date - 2021-01-20T16:15:30+05:30

ప్రమాణ స్వీకారానికి కొన్ని గంటల ముందు అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలదేవి హ్యారిస్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ప్రమాణ స్వీకారానికి కొన్ని గంటల ముందు అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలదేవి హ్యారిస్ ఆసక్తికర ట్వీట్ చేశారు. భర్త, అమెరికా సెకండ్ జెంటిల్మన్ డగ్ ఎమ్హాఫ్‌తో పాటు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ దంపతులతో కలిసి కేపిటల్ వాషింగ్టన్ మాన్యుమెంట్ వద్ద దిగిన ఫొటోను కమల ట్వీట్ చేశారు. అమెరికన్లు సమైక్యతతో ఉండాలనే క్యాప్షన్‌తో ఈ ఫోటోను ఆమె ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, అమెరికా 49వ ఉపాధ్యక్షురాలిగా బుధవారం కమలా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుప్రీంకోర్టు జస్టిస్ సోనియా సోటోమేయర్ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. దీంతో ఈ పదవి చేపడుతున్న తొలి మహిళగా, భారతీయ సంతతికి చెందిన తొలి వ్యక్తిగా, ఆఫ్రికన్‌- ఏషియన్‌ మూలాలున్న వ్యక్తిగా ఆమె చరిత్రకెక్కబోతున్నారు.



Updated Date - 2021-01-20T16:15:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising