ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సౌదీలో కడప మహిళ అంత్యక్రియలు

ABN, First Publish Date - 2021-03-09T19:41:21+05:30

ఎవరి బాగు కొరకు తాను ఎడారికి వచ్చి రేయింబవళ్ళు పని చేసి సంపాదించిందో వారే అనివార్య కారణాల వలన ప్రక్కకు తప్పుకోవడంతో కడప జిల్లాకు చెందిన ప్రవాసీ మహిళకు నాటకీయ పరిణమాల మధ్య ఎట్టకేలకు సౌదీ అరేబియాలో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రవాసంలో అనారోగ్యం, పేదరికం, మత మార్పిడి

ఎట్టకేలకు సౌదీలో కడప మహిళకు అంత్యక్రియలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఎవరి బాగు కొరకు తాను ఎడారికి వచ్చి రేయింబవళ్ళు పని చేసి సంపాదించిందో వారే అనివార్య కారణాల వలన ప్రక్కకు తప్పుకోవడంతో కడప జిల్లాకు చెందిన ప్రవాసీ మహిళకు నాటకీయ పరిణమాల మధ్య ఎట్టకేలకు సౌదీ అరేబియాలో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. నెల రోజులకు పైగా సౌదీ అరేబియాలోని అల్ ఖోబర్‌లో పడి ఉన్న కడప జిల్లా చెన్నూరు పట్టణం సవడమ్మగుడి ప్రాంతానికి చెందిన కొండూరు రాజీ అనే మహిళ మృతదేహాన్ని స్వీకరించడానికి వివిధ సామాజిక, ఆర్ధిక కారణాల వలన అమె కుటుంబం నిరాకరిస్తుండడంతో అమెను సౌదీలోనే ఖననం చేశారు. అంత్యక్రియలకు ముందు ఆమెను కడసారి వీడియో కాల్ ద్వారా చూపించడానికి ప్రయత్నించగా అమె కుటుంబ సభ్యులు దానికి కూడ ఇష్టపడలేదు. రొమ్ము క్యాన్సర్ సోకిన అమె కర్నూలులో శస్త్ర చికిత్స చేయించుకోని సౌదీకు తిరిగి వచ్చి అనారోగ్యంతో జనవరి 21న మరణించింది.


రాజీ మృతదేహాన్ని కడప జిల్లాలో ఆమె వారసుల ఇంటి వరకు చేర్చడంతో పాటుగా దహాన సంస్కారానికి అవసరమైన ఖర్చులను కూడా భరిస్తామని కూడ సౌదీలోని దమ్మాంలోని కేరళ ప్రవాసీయులు ముందుకు వచ్చినప్పటికి అద్దె ఇళ్ళు, పేదరికం, సామాజిక కారణాల వలన అంతిమక్రియలకు వారసులు ముందుకు రాలేదు. దీంతో రాజీను సౌదీలో అంతిమక్రియలు చేయడానికి సన్నహాలు చేశారు. ఈ క్రమంలో గతంలో ఆమె పని చేసిన యాజమానురాలిని సంప్రదించారు. రాజీ అంతిమ సంస్కారాలు ఏ విధంగా జరుపుతున్నారో తెలుసుకున్న యజమానురాలు.. రాజీ ఇస్లాం మతం స్వీకరించిందని, ఆమెకు ఇస్లామిక్ విధానంలో అంత్యక్రియలు జరపాల్సిందిగా సూచించారు. దాంతో ఆమె కోరిక మేరకు ఇస్లామిక్ విధానంలో అంతిమక్రియలు జరిపినట్లుగా సామాజిక కార్యకర్త నాస్ శౌకత్ చెప్పారు. తన ఇద్దరు కూతుళ్ళ భవిష్యత్తు కొరకు గల్ఫ్‌కు వచ్చిన రాజీ దయనీయస్ధితిలో మరణించగా కనీసం ఆమె కూతుళ్ళు ఆమెను కడసారి చూడటానికి కూడా ఆసక్తి కనబర్చకపోవడం ఆర్ధిక అవసరాలు, అనివార్యలతో పతనమవుతున్న మానవ సంబంధాలకు ఒక ప్రతీక అని చెప్పొచ్చు.


Updated Date - 2021-03-09T19:41:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising