ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేద దేశాలకు ఇప్పటివరకు అందిన వ్యాక్సిన్ డోస్‌లు 25 మాత్రమే: డబ్ల్యూహెచ్ఓ

ABN, First Publish Date - 2021-01-19T21:20:01+05:30

పేద దేశాలకు ఇప్పటివరకు అందిన వ్యాక్సిన్ డోస్‌లు కేవలం 25 మాత్రమే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జెనీవా: పేద దేశాలకు ఇప్పటివరకు అందిన వ్యాక్సిన్ డోస్‌లు కేవలం 25 మాత్రమే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఆవేదన వ్యక్తం చేశారు. డబ్ల్యూహెచ్ఓ వార్షిక ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న ఆయన వ్యాక్సిన్ విషయంలో పేద దేశాలకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడారు. కొవిడ్-19 వ్యాక్సిన్లను పంచుకోవడంలో ప్రపంచం వైఫల్యం అంచున ఉందని ఆయన చెప్పారు. 49 ధనిక దేశాల్లో ఇప్పటివరకు దాదాపు 4 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను వేస్తే.. తక్కువ ఆదాయం కలిగి ఉన్న పేద దేశాల్లో కేవలం 25 వ్యాక్సిన్ డోస్‌లు వేయడం జరిగిందని వివరించారు. 


తక్కువ ఆదాయం కలిగి ఉన్న గెనీ అనే ఒక్క దేశంలో మాత్రమే ఇప్పటివరకు 25 వ్యాక్సిన్ డోస్‌లు ఇచ్చినట్టు టెడ్రోస్ చెప్పారు. ఆ 25 డోస్‌లు కూడా రష్యాకు చెందిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ అని అన్నారు. వ్యాక్సిన్ డోస్‌లను ప్రపంచం మొత్తం న్యాయంగా పంచాలని ఆయన ప్రపంచ దేశాలను, వ్యాక్సిన్ తయారీదారులను కోరారు. ధనిక దేశాలు ‘మాకే ముందు’ అనే విధానంలో ముందుకు వెళ్లడం వల్ల పేద దేశాలు మరింత ప్రమాదానికి గురవుతున్నాయని టెడ్రోస్ అన్నారు. ఇటువంటి చర్యల కారణంగా మహమ్మారి మరింత కాలం పాటు కొనసాగుతుందన్నారు.

Updated Date - 2021-01-19T21:20:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising