ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్వేతసౌధం నుంచి రెండు శునకాలను వెనక్కి పంపిన బైడెన్

ABN, First Publish Date - 2021-03-09T22:52:02+05:30

అధ్యక్షుడు జో బైడెన్‌కు సంబంధించిన రెండు జర్మన్ షెపార్డ్స్ శునకాలను అధ్యక్ష భవనం నుంచి డెలావేర్‌లోని ఆయన పాత ఇంటికి పంపించారు అధికారులు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అధ్యక్షుడు జో బైడెన్‌కు సంబంధించిన రెండు జర్మన్ షెపార్డ్స్ శునకాలను అధ్యక్ష భవనం నుంచి డెలావేర్‌లోని ఆయన పాత ఇంటికి పంపించారు అధికారులు. శ్వేతసౌధం సెక్యూరిటీ సిబ్బందిపై ఈ శునకాలు దాడికి యత్నించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బైడెన్ ఆదేశాల మేరకు మేజర్, చాంప్ అనే రెండు శునకాలను అధికారులు సోమవారం డెలావేర్‌కు తరలించారు. ఇందులో మేజర్ అనే శునకం ఏకంగా సిబ్బందిని కరిచిందని తెలుస్తోంది. అలాగే చాంప్ కూడా సిబ్బందిపై తరచూ మొరగడం చేస్తుండడంతో ఈ రెండింటినీ విల్మింగ్టన్‌లోని డెలావేర్‌లో ఉన్న బైడెన్ పాత నివాస గృహానికి తరలించారు.


కాగా, ఈ రెండు శునకాలను అధ్యక్షుడు బైడెన్, ఆమె సతీమణి, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ 2018లో డెలావేర్ హ్యూమన్ అసోసియేషన్ నుంచి దత్తత తీసుకున్నారు. గతేడాది నవంబర్‌లో మేజర్‌తో ఆడుతున్నప్పుడే బైడెన్ పాదానికి గాయం కూడా అయింది. ఇక బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జనవరి 25న తనకు సంబంధించిన శునకాలను అధ్యక్ష భవనానికి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి మేజర్, చాంప్ శ్వేతసౌధంలోనే ఉంటున్నాయి. అయితే, మొదటి నుంచి ఇవి రక్షణ సిబ్బంది పట్ల దూరుసుగానే ఉంటున్నాయి. ఈ క్రమంలో ఇటీవల మేజర్ ఓ సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేయడంతో ఈ రెండింటినీ అవి బాగా అలవాటు పడిన పాత ఇంటికే తిరిగి పంపించారు బైడెన్.     

Updated Date - 2021-03-09T22:52:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising