ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొలిరోజే వలసదారులకు ఊరటనిచ్చే నిర్ణయం..?

ABN, First Publish Date - 2021-01-20T19:08:06+05:30

జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిరోజు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిరోజు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. దీనిలో భాగంగా వలసదారులకు ఊరటనిచ్చే కీలక బిల్లును కూడా ఆయన ప్రతిపాదించనున్నారని సమాచారం. అక్రమంగా అగ్రరాజ్యంలో ఉంటున్న సుమారు కోటి 10 లక్షల మందికి దీని ద్వారా లబ్ధి చేకూరనుంది. వీరికి ఎనిమిదేళ్లలో చట్టబద్ధత కలిగించేలా ఈ బిల్లు ఉండనుంది. దీనిలో భాగంగా మొదటి ఐదేళ్లు దేశంలోని అక్రమ వలసదారులకు తాత్కాలిక చట్టబద్ధత కల్పిస్తారు. అది కూడా 2021, జనవరి 1 నాటికి అన్ని పన్నులు చెల్లిస్తున్న వారికి మాత్రమే దీన్ని వర్తింప జేయనున్నారు. ఆ తర్వాత మూడేళ్ల కాలంలో మరికొన్ని నిబంధనలతో వీరికి గ్రీన్‌కార్డు జారీకి సిఫార్సు చేస్తారు. కాగా, బైడెన్ ఎన్నికల హామీలలో అక్రమ వలసదారులకు పౌరసత్వం కలిపించడం అనేది కూడా ఒకటి. అందుకే మొదట అధ్యక్షుడు ఈ బిల్లును ప్రతిపాదించనున్నారని సమాచారం. ఇక ట్రంప్ హయాంలో కఠిన ఇమ్మిగ్రేషన్ విధానాలతో విసిగిపోయిన వలసదారులకు బైడెన్ నిర్ణయం పెద్ద ఊరట అనే చెప్పాలి. 

Updated Date - 2021-01-20T19:08:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising