ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డెల్టా వేరియంట్: అమెరికాలో మళ్లీ కరోనా ఆంక్షలు పెట్టే అవకాశం

ABN, First Publish Date - 2021-07-31T22:23:11+05:30

అమెరికాలో డెల్టా వేరియంట్ వ్యాపిస్తుండటంతో ప్రభుత్వం మళ్లీ కరోనా ఆంక్షలను అమలు చేసేందుకు సిద్దమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికాలో డెల్టా వేరియంట్ వ్యాపిస్తుండటంతో ప్రభుత్వం మళ్లీ కరోనా ఆంక్షలను అమలు చేసేందుకు సిద్దమైంది. ఇదే విషయంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ.. దేశవ్యాప్తంగా మళ్లీ ఆంక్షలను అమలు చేసే అవకాశమున్నట్టు తెలిపారు. అయితే ఈసారి ఎటువంటి ఆంక్షలు పెట్టే దానిపై ఆయన నోరువిప్పలేదు. వ్యాక్సినేషన్ విషయానికి వస్తే.. గురువారం ఒక్కరోజే దాదాపు పది లక్షల మందికి వ్యాక్సిన్ వేసినట్టు జో బైడెన్ ఆనందం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ అనేది ఎంత అవసరమో ప్రజలు గ్రహిస్తున్నట్టు తాను ఆశిస్తున్నానన్నారు. డెల్టా వేరియెంట్ విజృంభిస్తుండటంతో ప్రజలు మాస్క్‌లు పెట్టుకుని తిరగాలంటూ అధికారులు ఇటీవల సూచించిన విషయం తెలిసిందే. 


మరోపక్క ప్రభుత్వ అధికారులు తప్పక వ్యాక్సిన్ వేసుకోవాలని, ఫేస్‌మాస్క్ ధరించాలనే నిబంధనలను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇదిలా ఉంటే.. డెల్టా వేరియంట్ మరింత వ్యాప్తి చెందకుండా, మరిన్ని కొత్త వేరియంట్లు పుట్టుకురాక ముందే కరోనా మహమ్మారిని అదుపు చేయాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రపంచ దేశాలకు సూచించింది. కాగా.. అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు 3.5 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదుకాగా.. కరోనా బారిన పడి దాదాపు 6.3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 

Updated Date - 2021-07-31T22:23:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising