ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడంపై బైడెన్ ఏమన్నారంటే..

ABN, First Publish Date - 2021-03-26T17:52:47+05:30

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీచేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీచేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. గురువారం తొలిసారి మీడియా సమావేశంలో పాల్గొన్న బైడెన్ రాబోయే ప్రెసిడెంట్ ఎలక్షన్‌లో మళ్లీ పోటీ చేస్తాననే సంకేతాలిచ్చారు. 'రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయడమే నా ప్రణాళిక. అదే నా అంచనా కూడా' అని విలేకరుల సమావేశంలో బైడెన్ అన్నారు. అంతేగాక అప్పుడు కూడా ఉపాధ్యక్షురాలిగా మళ్లీ కమలా హ్యారిసే పోటీ చేస్తారని బైడెన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం బైడెన్‌కు 78 ఏళ్లు.. అంటే 2024 నాటికి 82 ఏళ్లకు చేరుతారు. ఇప్పటికే ఆయన అమెరికా అధ్యక్షపీఠం అధిరోహించిన అధ్యక్షుల్లో వయోవృద్ధిడిగా రికార్డుకెక్కారు.  


ఇక బైడెన్ 2024 ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తానని చెప్పడంతో.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మరోసారి తలపడబోతున్నారా? అని ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. దీనికి అప్పటికీ ఇంకా రిపబ్లికన్ పార్టీ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అంటూ చమత్కరించారు బైడెన్. తాను విధిని బాగా నమ్ముతానని, అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందని బైడెన్ చెప్పుకొచ్చారు. కాగా, ఈ సమావేశానికి కేవలం 30 మంది మీడియా ప్రతినిధులను మాత్రమే అవకాశం కల్పించింది శ్వేతసౌధం సిబ్బంది. ఇక బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడటం కూడా ఇదే తొలిసారి.    

Updated Date - 2021-03-26T17:52:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising