ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా కోసం ట్రంప్ లేఖ విడిచి వెళ్లారు: బైడెన్

ABN, First Publish Date - 2021-01-21T15:30:18+05:30

చివరి వరకు జో బైడెన్‌ విజయాన్ని అంగీకరించని డొనాల్డ్ ట్రంప్.. కొత్త అధ్యక్షుడికి లేఖ రాసే ఆనవాయితీని మాత్రం కొనసాగించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: చివరి వరకు జో బైడెన్‌ విజయాన్ని అంగీకరించని డొనాల్డ్ ట్రంప్.. కొత్త అధ్యక్షుడికి లేఖ రాసే ఆనవాయితీని మాత్రం కొనసాగించారు. శ్వేతసౌధాన్ని వీడుతూ ఓవల్ కార్యాలయంలో ఓ లేఖను విడిచి వెళ్లారు. ఈ విషయాన్ని కొత్తగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్ వైట్ హౌస్ వద్ద మీడియాతో తెలిపారు. కొత్త అధ్యక్షుడికి లేఖ రాసే ఆనవాయితీని ట్రంప్ కొనసాగించడం సంతోషం అని ఈ సందర్భంగా బైడెన్ పేర్కొన్నారు. నూతన అధ్యక్షుడికి విషెస్ చెబుతూ.. ప్రెసిడెంట్‌కు మద్దతుగా ఉంటానని, ఆయన పదవీ కాలాన్ని ప్రశాంతంగా ముగించాలని కోరుకుంటున్నట్లు లేఖలో ట్రంప్ పేర్కొన్నారని సమాచారం. 


ఇదిలాఉంటే.. బైడెన్ ప్రమాణస్వీకారోత్సవానికి ట్రంప్ హాజరుకాని విషయం తెలిసిందే. ఉపాధ్యక్షుడిగా పని చేసిన మైక్‌ పెన్స్‌ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి కొన్ని గంటల ముందే ట్రంప్ వాషింగ్టన్ నుంచి ఫ్లోరిడా వెళ్లిపోయారు. అధ్యక్ష హోదాలోనే ట్రంప్ నిష్క్రమణ జరగడం గమనార్హం. ఇక పటిష్టమైన భద్రతా నడుమ 78 ఏళ్ల జో బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. సుమారు 25వేల మంది నేషనల్‌ గార్డ్స్‌ పహారాలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. 


ప్రమాణస్వీకారం అనంతరం బైడెన్ మాట్లాడుతూ కొత్త శకం మొదలైంది.. ఇది ప్రజాస్వామ్య విజయం.. తాను అమెరికన్లందరికీ అధ్యక్షుడినని పేర్కొన్నారు. దేశాన్ని ఏకతాటిపై తేవడం, కరోనాపై విజయం దిశగా చర్యలు చేపట్టడం, వ్యక్తిగత లాభం కోసం కాకుండా ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తానని బైడెన్ అన్నారు. అటు బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు బైడెన్ తన మార్క్‌ను చూపించారు. 17 కీలక ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - 2021-01-21T15:30:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising