ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైడెన్ పాలకవర్గంలో మరో భారత సంతతి మహిళకు చోటు!

ABN, First Publish Date - 2021-01-17T22:31:16+05:30

అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్.. మరో భారత సంతతికి చెందిన మహిళకు తన అడ్మినిస్ట్రేషన్‌లో చోటు కల్పించారు. భారత మూలాలున్న ఉజ్రా జెయా‌ను స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో అండర్ సెక్రటరీగా బై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్.. మరో భారత సంతతికి చెందిన మహిళకు తన అడ్మినిస్ట్రేషన్‌లో చోటు కల్పించారు. భారత మూలాలున్న ఉజ్రా జెయా‌ను స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో అండర్ సెక్రటరీగా బైడెన్ నామినేట్ చేశారు. కాగా.. ట్రంప్ ప్రభుత్వంలో కూడా ఈమె కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా 2018లో ఆమె తన ఫారిన్ సర్వీస్‌ను వదిలేశారు. కాగా.. స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో అండర్ సెక్రటరీగా తనను జో బైడెన్ నామినేట్ చేయడంపట్ల ఉజ్రా జెయా స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. ‘థాంక్యూ.. ప్రెసిడెంట్ ఎలెక్ట్ బైడెన్. అమెరికన్లకు మరోసారి సేవ చేయడానికి నాకు అవకాశం కల్పించారు’ అని వ్యాఖ్యానించారు. ‘దౌత్యవేత్తగా 25 సంవత్సరాలపాటు పని చేశాను. వైవిధ్యాలు, ప్రజాస్వామిక ఆదర్శాలే అమెరికా గొప్ప బలాలని తెలుసుకున్నాను. స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో అండర్ సెక్రటరీగా నేను వీటిని సంరక్షిస్తూ కొనసాగిస్తాను’ అని ఉజ్రా జెయా స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. ఉజ్రా జెయాతో కలిపి బైడెన్ పాలక వర్గంలో చోటు దక్కించుకున్న భారత సంతతికి చెందిన మహిళల సంఖ్య 13కి చేరింది. ఈ జాబితాలో ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌ కూడా ఉన్నారు. 


Updated Date - 2021-01-17T22:31:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising