ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో కీలక పదవికి భారతీయుడ్ని ఎంపిక చేసిన బైడెన్

ABN, First Publish Date - 2021-01-19T14:33:02+05:30

అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న జో బైడెన్ తన పాలకవర్గంలో ఇప్పటికే 20 మంది భారత సంతతి వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న జో బైడెన్ తన పాలకవర్గంలో ఇప్పటికే 20 మంది భారత సంతతి వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. తాజాగా మరో భారతీయుడిని కీలక పదవికి ఎంపిక చేశారు. భారతీయ అమెరికన్ రోహిత్ చోప్రాను కన్స్యూమర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ బ్యూరో(సీఎఫ్‌పీబీ) చీఫ్‌గా నియమించారు. కాథ్లీన్ లౌరా క్రానింగర్ స్థానంలో రోహిత్ ఎంపికయ్యారు. ప్రస్తుతం రోహిత్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ కమిషనర్‌గా ఉన్నారు. 2018లో సెనేట్ ఆయనను ఈ పదవికి ఏకగ్రీవంగా ఎంపిక చేయడం విశేషం. ఈ పదవిలో ఆయన చట్ట ఉల్లంఘనలకు పాల్పడే కంపెనీలను అదుపు చేయడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఇంతకుముందు ఆయన సీఎఫ్‌పీబీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా విధులు నిర్వహించారు. తాజాగా కీలక పరిపాలన స్థానాలకు పలువురిని నియమించిన బైడెన్.. రోహిత్‌కు సీఎఫ్‌పీబీ చీఫ్‌గా బాధ్యతలు అప్పగించారు.     

Updated Date - 2021-01-19T14:33:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising