ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమ వలసదారులకు జో బైడెన్ భరోసా!

ABN, First Publish Date - 2021-03-01T00:52:02+05:30

అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన చేశారు. అక్రమ వలసదారులను వ్యాక్సిన్ పొందేందుకు అర్హులుగా ప్రకటించారు. ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా టీకాను వేయించుకోవాలని పిలుపునిచ్చా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన చేశారు. అక్రమ వలసదారులను వ్యాక్సిన్ పొందేందుకు అర్హులుగా ప్రకటించారు. ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా టీకాను వేయించుకోవాలని పిలుపునిచ్చారు. వివరాల్లోకి వెళితే.. అగ్రరాజ్యం అమెరికాను కొవిడ్ అతలాకుతలం చేస్తున్న తరుణంలో  గత ఏడాది డిసెంబర్‌లో అక్కడి ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం 50 మిలియన్ల మందికి వ్యాక్సిన్ అందించి.. కీలక మైలురాయిని చేరుకుంది.


ఈ నేపథ్యంలో తాజాగా ఓ కార్యక్రమంలో అగ్రరాజ్య అధినేత జో బైడెన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికాలోకి అక్రమంగా వలసవచ్చిన వారిని ఉద్దేశిస్తూ.. ‘నేను ఓ విషయాన్ని స్పష్టం చేయదలచుకున్నాను. వారందరూ వ్యాక్సిన్‌ పొంది.. మహమ్మారి నుంచి రక్షించన పొందతారు. వ్యాక్సినేషన్ విషయంలో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్‌ అధికారులు జోక్యం చేసుకోరు. అరెస్ట్‌లు చేయరు’ అని పేర్కొన్నారు. కాగా.. వ్యాక్సినేషన్ కేంద్రాల పరిసరాల్లో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అధికారులు ఎటువంటి కార్యకలాపాలను నిర్వహించరని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఇంతకుముందే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. అమెరికాలో దాదాపు 11 మిలియన్ల మంది అక్రమవలసదారులు ఉన్నట్లు సమాచారం. బైడెన్ ప్రకటనతో వారందరూ ధైర్యంగా ముందుకొచ్చి వ్యాక్సిన్ వేయించుకుంటారని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 


Updated Date - 2021-03-01T00:52:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising