ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొలి భేటీకి గుర్తుగా.. పుతిన్‌కు బైడెన్ విలువైన బ‌హుమ‌తి!

ABN, First Publish Date - 2021-06-18T19:06:06+05:30

స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌, ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ తొలిసారి భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌మావేశానికి గుర్తుగా పుతిన్‌కు బైడెన్ ఓ విలువైన బ‌హుమ‌తి ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జెనీవా: స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌, ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ తొలిసారి భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌మావేశానికి గుర్తుగా పుతిన్‌కు బైడెన్ ఓ విలువైన బ‌హుమ‌తి ఇచ్చారు. రాండోల్ఫ్ ఇంజనీరింగ్ రూపొందించిన ప్ర‌త్యేక‌మైన‌ సన్‌గ్లాసెస్‌ను పుతిన్‌కు బహుక‌రించారు బైడెన్. ఈ సన్‌గ్లాసెస్‌ సంస్థ "కాంకోర్డ్ స్టైల్" ఏవియేటర్స్. 23 క్యారెట్ల బంగారు పూత‌తో 57 మిల్లీమీట‌ర్ల‌ అమెరికన్ గ్రే రంగు లెన్సుల‌తో త‌యారుచేయ‌బ‌డ్డాయి. అలాగే కుడి లెన్సుపై బైడెన్ సంతకం కూడా ఉంటుంది. ఇక బైడెన్‌-పుతిన్ మ‌ధ్య జ‌రిగిన ఈ తొలి భేటీ సుమారు రెండున్నర గంటల పాటు సాగిన‌ట్లు స‌మాచారం.


ఈ సందర్భంగా డ్రాగ‌న్ దేశం చైనాతో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని పుతిన్‌కు బైడెన్ సూచించార‌ని తెలుస్తోంది. అలాగే రష్యాతో సన్నిహిత సంబంధాలకు అగ్ర‌రాజ్యం సిద్ధంగా ఉందని చెప్పిన బైడెన్ ఇక ముందు కూడా ఈ చర్చలను కొనసాగిస్తామని అన్నారు. అటు ర‌ష్యా అధ్య‌క్షుడు సైతం ఈ  చర్చలపై సంతృప్తి వ్యక్తం చేశారు. చర్చలు నిర్మాణాత్మకంగా జరిగాయని చెప్పిన‌ పుతిన్‌.. బైడెన్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఆయ‌న తెలివైన వార‌ని, చాలా అనుభ‌వం గ‌ల‌వార‌ని, అన్ని విష‌యాల‌పై మంచి ప‌రిజ్ఞానం ఉంద‌న్నారు. అంతేగాక‌ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో పోలిస్తే బైడెన్ శైలి పూర్తి భిన్నంగా ఉందని తెలిపారు. 

Updated Date - 2021-06-18T19:06:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising