ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వలసదారులకు ఊరట కల్పించిన బైడెన్.. ట్రంప్ ఉత్తర్వుల రద్దు!

ABN, First Publish Date - 2021-05-15T18:33:27+05:30

అమెరికా వచ్చే వలసదారులకు జో బైడెన్ ఊరట కల్పించారు. వలసదారుల విషయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులను ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ రద్దు చేశారు. పూర్తి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా వచ్చే వలసదారులకు జో బైడెన్ ఊరట కల్పించారు. వలసదారుల విషయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులను ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ రద్దు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. వైద్య సేవల కోసం అయ్యే ఖర్చును భరించలేని వలసదారులు అమెరికాకు రాకుండా డొనాల్డ్ ట్రంప్ 2019 ఉత్తర్వులు జారీ చేశాడు. అమెరికాలోకి వచ్చిన వలసదారులు 30 రోజుల్లోగా ఆరోగ్య బీమాను తీసుకోవాలని లేదా వైద్య ఖర్చులు భరించే స్తోమత తమకు ఉందని నిరూపించుకోవాలని ట్రంప్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు అమెరికా వెళ్లాలనుకునే వలదారులకు ఇబ్బందికరంగా మారాయి. తాజాగా జో బైడెన్ ఈ ఉత్తర్వులను రద్దు చేశారు. ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులు అమెరికా ప్రయోజనాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని జో బైడెన్ పేర్కొన్నారు. అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆరోగ్య బీమాను కొనుగోలు చేయలేని వలసదారులపై నిషేధం వధించకుండానే ఆ లక్ష్యం చేరుకోగలమనే నమ్మకం ఉందని బైడెన్ స్పష్టం చేశారు. 


Updated Date - 2021-05-15T18:33:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising