ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తేలికగా తీసుకుంటే.. భారీ మూల్యం చెల్లించక తప్పదు: బైడెన్

ABN, First Publish Date - 2021-03-30T19:43:43+05:30

అగ్రరాజ్యం అమెరికాను మహమ్మారి కరోనా వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా సుమారు ఐదున్నర లక్షల మందిని కొవిడ్-19 పొట్టనబెట్టుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహమ్మారి ముప్పు ఇంకా తొలిగిపోలేదు.. తేలికగా తీసుకోవద్దు: బైడెన్

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాను మహమ్మారి కరోనా వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా సుమారు ఐదున్నర లక్షల మందిని కొవిడ్-19 పొట్టనబెట్టుకుంది. అధ్యక్షుడు జో బైడెన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం, మాస్కు ధరించాలని కోరడం వంటి చర్యల వల్ల కొంతమేర వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టపడింది. అయితే, ఇటీవల కొందరు కరోనాను తేలికగా తీసుకుంటూ.. వైరస్ ప్రభావం తగ్గిపోయిందనే ముందస్తు ప్రచారాన్ని తెరలేపడం బైడెన్‌తో పాటు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)కు కోపాన్ని తెప్పించింది. ఈ నేపథ్యంలో బైడెన్, సీడీసీ సోమవారం దేశ ప్రజలకు తీవ్రంగా హెచ్చరించారు. మహమ్మారి ముప్పు పూర్తిగా తొలిగిపోలేదని, నిబంధనలు పాటించకపోతే మళ్లీ వైరస్ విజృంభించే అవకాశం ఉందని తెలిపారు. కనుక దేశ పౌరులు, నివాసితులు తప్పకుండా మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం, అర్హత ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకోవడం చేయాలని సూచించారు. తన మాటలను తేలికగా తీసుకుంటే మాత్రం భారీ మూల్యం చెల్లించక తప్పదని అధ్యక్షుడు వార్నింగ్ ఇచ్చారు. 


వారం రోజులుగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న విషయాన్ని సైతం ఈ సందర్భంగా బైడెన్ గుర్తు చేశారు. గత వారం కంటే ఈ వారం 10 శాతం పాజిటివ్ కేసులు అధికంగా నమోదైనట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 60వేల వరకు కొత్త కేసులు నమోదవుతున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే బైడెన్ సోమవారం దేశ ప్రజలను హెచ్చరించారు. కాగా, దేశవ్యాప్తంగా వేగవంతంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌లో భాగంగా ఈ వారం సుమారు 33 మిలియన్ల మందికి టీకా అందించాలనే లక్ష్యంతో ఉన్నట్లు పేర్కొన్నారు. సీడీసీ డేటా ప్రకారం ఇప్పటి వరకు ప్రతి ఐదుగురు వయోజనులలో ఒకరికి, అలాగే 50 శాతం సీనియర్ సిటిజెన్స్‌కు రెండు డోసుల వ్యాక్సిన్ ఇవ్వడం పూర్తైనట్లు తెలియజేశారు. గత గురువారం ఒకేరోజు రికార్డు స్థాయిలో 3.2 మిలియన్ల మోతాదుల వ్యాక్సిన్ పంపిణీ జరగడం విశేషం. వైద్య నిపుణులు ఎంతో శ్రమపడి మనకోసం రూపొందించిన టీకాలను మన విధిగా తీసుకోవాలని కోరారు. అలాగే దేశ పౌరులు, నివాసితులు వైరస్‌ను తేలికగా తీసుకోవద్దని సీడీసీ, అధ్యక్షుడు వార్న్ చేశారు. సాధ్యమైనంత వరకు కొవిడ్ నిబంధనలను పాటించడం, తప్పకుండా టీకా తీసుకోవడం వంటి చర్యల వల్లే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమని బైడెన్ స్పష్టం చేశారు.  

Updated Date - 2021-03-30T19:43:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising