ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మారిషస్‌లో భారతీయులను కలిసిన విదేశాంగ మంత్రి జైశంకర్!

ABN, First Publish Date - 2021-02-25T07:37:45+05:30

మారిషస్ వచ్చినప్పుడల్లా సొంత ఇంటికి (స్వదేశానికి) వచ్చిన అనుభూతి కలుగుతుందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. వివరాల్లోకి వెళితే.. విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రస్తుతం మారిషస్‌లో ప

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మారిషస్ వచ్చినప్పుడల్లా సొంత ఇంటికి (స్వదేశానికి) వచ్చిన అనుభూతి కలుగుతుందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్  వ్యాఖ్యానించారు. వివరాల్లోకి వెళితే.. విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రస్తుతం మారిషస్‌లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రోజు ఆయన అక్కడ నివసిస్తున్న భారతీయులను కలుసుకున్నారు. వారితో పలు అంశాలను చర్చించారు. అనంతరం మారిషస్‌లోని భారతీయులను కలవడంపట్ల ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ‘భారతీయ విలువలు, విశ్వాసాలను మారిషస్‌లో కూడా పాటిస్తున్న భారతీయ సమాజానికి ధన్యవాదాలు. శాంతి, భాగస్వామ్య పురోగతి, సార్వత్రిక సోదరభావం తదితర విలువలను భారత్ పాటిస్తోంది. నేను నా జీవితంలో చాలా దేశాల్లో పర్యటించాను. మారిషస్‌లో పర్యటన మాత్రం ఎల్లప్పుడూ భిన్నంగా ఉంటుందని కచ్చితంగా చెప్పగలను. ఇక్కడికొస్తే స్వదేశానికి వచ్చినట్టు ఉంటుంది’ అని ట్వీట్ చేశారు. 


Updated Date - 2021-02-25T07:37:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising