ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vande Bharat Mission స్వదేశానికి చేరిన 60 లక్షల మంది భారతీయులు

ABN, First Publish Date - 2021-08-04T23:37:41+05:30

వందే భారత్ మిషన్ ద్వారా విదేశాల్లో చిక్కుకున్న 60లక్షల మంది భారతీయులను స్వదేశానికి తరలించామని భారత ప్రభుత్వం పార్ల‌మెంట్ వేదికగా వెల్లడించింది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభ సభ్యు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వందే భారత్ మిషన్ (వీబీఎం) ద్వారా విదేశాల్లో చిక్కుకున్న 60లక్షల మంది భారతీయులను స్వదేశానికి తరలించామని భారత ప్రభుత్వం పార్ల‌మెంట్ వేదికగా వెల్లడించింది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభ సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ స్పందించారు. ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి వీబీఎం ద్వారా 60లక్షల మంది భారతీయులను ఇండియాకు తరలించినట్టు రాతపూర్వకంగా చెప్పారు. ఇంత వరకు ఏ ప్రభుత్వ హయాంలో కూడా ఇంత పెద్ద, సంక్లిష్టమైన రిపాట్రియేషన్ ప్రక్రియ జరగలేదన్నారు. వందే భారత్ మిషన్ ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన వెంటనే విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను నుంచి భారీ మొత్తంలో వినతలు వచ్చినట్టు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ మొదలైన నేపథ్యంలో విదేశాల్లో ఉన్న భారతీయులను ఇండియాకు తరలించేందుకు గత ఏడాది మే 7న భారత ప్రభుత్వం వందే భారత్ మిషన్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. 


Updated Date - 2021-08-04T23:37:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising