ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇటలీలో విషాదం.. 160 ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా..

ABN, First Publish Date - 2021-12-28T02:16:51+05:30

ఇటలీ దేశంలో దారుణంగా పడిపోతున్న జననాల రేటు ఓ విషాదమని క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ అభివర్ణించారు. ఈ స్థాయిలో జననాల రేటు పడిపోవడం ఇటలీ భవిష్యత్తుకు ప్రమాదకరమని ఆయన వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఇటలీ దేశంలో దారుణంగా పడిపోతున్న జననాల రేటు ఓ విషాదమని క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ అభివర్ణించారు. ఈ స్థాయిలో జననాల రేటు పడిపోవడం ఇటలీ భవిష్యత్తుకు ప్రమాదకరమని ఆయన వ్యాఖ్యానించారు. సెయింట్ పీటర్స్ బెసిలికా వేదికగా ప్రతివారం ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన ఈ హెచ్చరిక చేశారు. ‘‘ఇటలీలో అనేక జంటలు పిల్లల్ని కనాలనుకోవట్లేదు.. లేదా ఒక్కరితోనే సరిపెట్టుకుంటున్నారు. ఇది చాలా విషాదం. ఈ ఒరవడి మన దేశానికి, భవిష్యత్తుకు పూర్తి వ్యతిరేకం’’ అని తేల్చి చెప్పారు. 2020లో ఇటలీలో కేవలం 4,04,892 మంది పిల్లలు పుట్టారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే..2020లో జననాల సంఖ్య 15 వేల మేరకు తగ్గిపోయింది. 1861 తరువాత ఇటువంటి స్థితి ఎప్పుడూ చూడలేదని అక్కడి అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా.. ఇటలీలో గత 12 ఏళ్లుగా జననాల సంఖ్య పడిపోతూనే ఉందని గణాంకాలు చెబుతున్నాయి.


పోప్ గతంలోనూ ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘యువ జంటలు పిల్లల్ని కనేలా ప్రోత్సహించేందుకు వారికి ఉద్యోగ భద్రత కల్పించడం, తమకంటూ ఓ గూడు ఏర్పరుచుకోగలమనే నమ్మకం వారిలో కలిగించడం, వారు దేశాన్ని వీడకుండా ఉండేలా చర్యలు తీసుకోవడం అత్యావశ్యకం,’’ అని ఈ ఏడాది మేలోనే ఆయన తేల్చి చెప్పారు. ప్రభుత్వ విధానాలు కుటుంబాలకు అనుకూలంగా ఉండాలని ఆయన సూచించారు. 

Updated Date - 2021-12-28T02:16:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising