ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెచ్-4 వీసా జారీలో జాప్యానికి వ్యతిరేకంగా నిరసన !

ABN, First Publish Date - 2021-03-09T20:40:23+05:30

హెచ్​-4 వీసా జారీలో జాప్యానికి వ్యతిరేకంగా హెచ్​-1బీ వీసా కలిగిన ఐటీ వృత్తి నిపుణులు నిరసనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: హెచ్​-4 వీసా జారీలో జాప్యానికి వ్యతిరేకంగా హెచ్​-1బీ వీసా కలిగిన ఐటీ వృత్తి నిపుణులు నిరసనకు దిగారు. తమ జీవిత భాగస్వాములకు హెచ్-4 వర్కింగ్ వీసా జారీలో కావాలనే సంబంధిత అధికారులు జాప్యం చేస్తున్నట్లు ఈ సందర్భంగా మహిళా ఐటీ వృత్తి నిపుణులు ఆరోపించారు. వీసా జారీలో అధికారుల జాప్యం వల్ల తమ జీవనాధారం కోల్పోతున్నారని వేలాది మంది ప్రవాస మహిళా నిపుణులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గత వారం రోజులుగా కాలిఫోర్నియాలో 'సేవ్ హెచ్​4ఎడ్' పేరిట నిరసనలు తెలుపుతున్నారు. వీరిలో భారతీయ నిపుణులు కూడా ఉన్నారు. హెచ్​-1బీ వీసా కలిగిన మహిళా నిపుణుల జీవిత భాగస్వాములకు హెచ్​-4 వర్కింగ్ వీసా జారీలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు అమెరికాలోని భారత మహిళా మేధావుల బృందం తెలియజేసింది. 


అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ అంశాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకే గత వారం రోజులుగా వారు ఆందోళన చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక హెచ్​-4 వీసా అనేది హెచ్​-1బీ వీసా కలిగిన వారి కుటుంబ సభ్యులకు(జీవిత భాగస్వామి, 21 ఏళ్లలోపు పిల్లలకు) యూఎస్ సిటిజెన్​షిప్ అండ్​ ఇమిగ్రేషన్​ సర్వీసెస్​(యూఎస్​సీఐఎస్​) జారీ చేస్తుంది. కాగా, హెచ్​-1బీ వీసా అనేది నాన్​ ఇమ్మిగ్రెంట్ వీసా. ఈ వీసా ఉన్న వారు అమెరికా సంస్థల్లో ఉద్యోగాలు పొందొచ్చు. ఈ వీసాలు పొందుతున్న వారిలో భారతీయ ఐటీ నిపుణులే అధికమని లెక్కలు చెబుతున్నాయి. 

Updated Date - 2021-03-09T20:40:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising