ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నారైల వల్ల భారతదేశ పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి

ABN, First Publish Date - 2021-12-03T00:04:04+05:30

ట్విటర్ సీఈఓగా భారతీయ అమెరికన్ పరాగ్ అగర్వాల్ ఎంపికైన నేపథ్యంలో భారత్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూడా తాజాగా స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ట్విటర్ సీఈఓగా భారతీయ అమెరికన్ పరాగ్ అగర్వాల్ ఎంపికైన నేపథ్యంలో భారత్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూడా తాజాగా స్పందించారు. ఎన్నారైల కారణంగా భారత్‌కు ప్రపంచ దేశాల్లో ఉన్న పేరు ప్రఖ్యాతులు మరింత ఇనుమడిస్తాయని వ్యాఖ్యానించారు. ‘‘ కొద్ది మంది మాత్రమే విదేశాలకు వెళుతున్నారు. తాము ఎంచుకున్న రంగాల్లో అద్భుతాలు సాధిస్తున్నారు. దీని వల్ల భారత దేశ పేరు ప్రఖ్యాతులు మరింత ఇనుమడిస్తాయి. ప్రవాసీయులు భారతదేశ రాయబారుల వంటి వారు. విదేశాల్లో వారు విజయాలు సాధిస్తున్నందుకు ప్రశంసిస్తున్నాను. భారత్‌లోనే ఉండిపోవాలని చెప్పదలుచుకోలేదు’’ అని ఆయన తాజాగా కామెంట్ చేశారు.  ప్రస్తుతం ట్విటర్‌తో పాటూ ఐబీఎమ్, మైక్రోసాఫ్ట్, గూగుల్, వీఎమ్ వేర్ వంటి అంతర్జాతీయ టెక్ సంస్థలకు భారతీయ అమెరికన్లు నేతృత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. 

Updated Date - 2021-12-03T00:04:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising