ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెంటగాన్‌ కీలక స్థానంలో భారత అమెరికన్‌

ABN, First Publish Date - 2021-10-17T08:10:07+05:30

భారత సంతతి వ్యక్తి, అమెరికా ఏరోస్పేస్‌, రక్షణ రంగ నిపుణుడు రవి చౌదరిని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్‌లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైమానిక దళంలో ఇంధన, వాతావరణ విభాగంలో బాధ్యతలు


వాషింగ్టన్‌, అక్టోబరు 15: భారత సంతతి వ్యక్తి, అమెరికా ఏరోస్పేస్‌, రక్షణ రంగ నిపుణుడు రవి చౌదరిని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్‌లో కీలక పదవి వరించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ రవి నియమించాలనుకుంటున్నట్లు తాజాగా పేర్కొన్నారని శ్వేత సౌధం ప్రకటించింది. వైమానిక దళంలో ఇంధన, వాతావరణ, ఇన్‌స్టాలేషన్స్‌ విభాగానికి ఆయన సహాయ కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే బైడెన్‌ రవిని నామినేట్‌ చేసినా.. అధికారికంగా ప్రభుత్వం ధ్రువీకరించాల్సి ఉంది. గతంలో అమెరికా వైమానిక దళంలో 1993 నుంచి 2015 వరకూ చౌదరి పైలట్‌గా పనిచేశారు. అమెరికా రవాణా శాఖలో సీనియర్‌ ఉద్యోగిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. నాసాలో సిస్టమ్స్‌ ఇంజనీర్‌గా నాసా వ్యోమగాముల భద్రతను పర్యవేక్షించారు. ఇక.. తాజా పదవిలో అమెరికా వైమానిక దళ వ్యూహరచన విధానాలు, మౌలిక వసతులు, ఇంధనం, భద్రత, ఆరోగ్యం, వైమానిక దళ సంసిద్ధత వంటి కీలక బాధ్యతలను రవి నిర్వర్తించాల్సి ఉంటుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - 2021-10-17T08:10:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising