ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Afghanistan Crisis: అఫ్ఘాన్‌లో చిక్కుకున్న 450 మంది భారతీయుల ఆందోళన!

ABN, First Publish Date - 2021-08-20T13:05:27+05:30

తాలిబన్ల చెరలో ఉన్న అఫ్ఘానిస్థాన్‌లో 450 మంది దాకా భారతీయులు చిక్కుకుపోయారు. వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం అమెరికా, ఇతర దేశాల రాయబార కార్యాలయలతో సంప్రదిస్తోంది. అఫ్ఘాన్‌ నుంచి మన రాయబార కార్యాలయ సిబ్బంది మొత్తాన్నీ తరలించిన నేపథ్యంలో అక్కడి భారతీయులు మన అధికారులను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బయటపడతామా? అఫ్ఘాన్‌లోని భారతీయుల ఆందోళన!

కాబూల్: తాలిబన్ల చెరలో ఉన్న అఫ్ఘానిస్థాన్‌లో 450 మంది దాకా భారతీయులు చిక్కుకుపోయారు. వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం అమెరికా, ఇతర దేశాల రాయబార కార్యాలయలతో సంప్రదిస్తోంది. అఫ్ఘాన్‌ నుంచి మన రాయబార కార్యాలయ సిబ్బంది మొత్తాన్నీ తరలించిన నేపథ్యంలో అక్కడి భారతీయులు మన అధికారులను సంప్రదించడానికి వీలుగా ‘స్పెషల్‌ అఫ్ఘానిస్థాన్‌ సెల్‌’ను ఏర్పాటు చేశారు. దానికి వచ్చిన కాల్స్‌ ఆధారంగా అక్కడ 450 మంది దాకా మనోళ్లు ఉన్నట్టు అంచనాకు వచ్చారు. కాగా, కాబూల్‌లోని గురుద్వారాలో చిక్కుకుపోయిన హిందువులు, సిక్కుల రక్షణకు అక్కడి తాలిబన్లు హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆ గురుద్వారా ప్రెసిడెంట్‌ గుర్నామ్‌సింగ్‌ తెలిపినట్టు అకాలీదళ్‌ నేత మంజీందర్‌ సింగ్‌ సిర్సా ప్రకటించారు. తాలిబన్లు కూడా ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా తెలిపారు. ఈ మేరకు ఒక వీడియోను కూడా వారు ట్వీట్‌ చేశారు.

Updated Date - 2021-08-20T13:05:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising