ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా విపత్తులో స్వదేశానికి అండగా ఎన్నారైలు

ABN, First Publish Date - 2021-08-04T22:43:51+05:30

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో లక్షలాది మంది భారతీయులు ఉన్నారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ.. సందర్భం వచ్చినప్పుడల్లా మాతృభూమిపై ఉన్న మమకారాన్ని వారు చూపిస్తూనే ఉన్నారు. కొవి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో లక్షలాది మంది భారతీయులు ఉన్నారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ.. సందర్భం వచ్చినప్పుడల్లా మాతృభూమిపై ఉన్న మమకారాన్ని వారు చూపిస్తూనే ఉన్నారు. కొవిడ్ సమయంలో తోచిన సహాయం చేస్తూ స్వదేశానికి అండగా నిలుస్తున్నారు. ఫ్రాన్స్‌ స్థిరపడ్డ ప్రవాస భారతీయులు తాజాగా ఇండియాలోని 13 వేరువేరు ప్రదేశాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు, ఎన్‌జీవోలకు వైద్య పరికరాలను విరాళంగా అందజేశారు. GOPIO France Metropole అనే ప్రవాస భారతీయులకు చెందిన ప్రపంచ స్థాయి సంస్థ ఫ్రాన్స్‌లోని ఇండియన్ కమ్యూనిటీ సభ్యులతో కలిసి విరాళాలు సేకరించింది. ఈ విరాళాలతో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు తదితర వైద్య పరికరాలను భారత్‌కు తరలించింది. ఈ సందర్భంగా ఈ సంస్థ జనరల్ సెక్రటరీ ఎటియెన్ దుబైల్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘సేవ్ లైవ్స్ ఇన్ ఇండియా’ అనే నినాదంతో విరాళాల ద్వారా వచ్చిన డబ్బుతోనే వైద్య పరికరాలను కొనుగోలు చేసి, ఇండియాకు తరలించినట్టు ప్రకటనలో వెల్లడించారు. ఈ క్యాంపెయిన్‌ను రాజా మున్నుస్వామి, మధుసుదన్ సుఖ్వాల్ తదితరులు ముందుండి నడిపించినట్టు చెప్పారు. 


Updated Date - 2021-08-04T22:43:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising