ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Covishield Vaccine: ప్రవాసులకు కువైట్‌లోని భారత ఎంబసీ కీలక సూచన!

ABN, First Publish Date - 2021-07-23T16:46:47+05:30

కువైట్‌లోని భారత ఎంబసీ ప్రవాసులకు తాజాగా కీలక సూచన చేసింది. కోవిషీల్డ్ కువైట్‌లో కూడా ఆమోదం పొందిందని, ఈ టీకా తీసుకున్న భారత ప్రవాసులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కలిగి ఉంటే కువైట్ వచ్చేందుకు ఎలాంటి ఆటంకం ఉండదని పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైట్ సిటీ: కువైట్‌లోని భారత ఎంబసీ ప్రవాసులకు తాజాగా కీలక సూచన చేసింది. కోవిషీల్డ్ కువైట్‌లో కూడా ఆమోదం పొందిందని, ఈ టీకా తీసుకున్న భారత ప్రవాసులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కలిగి ఉంటే కువైట్ వచ్చేందుకు ఎలాంటి ఆటంకం ఉండదని పేర్కొంది. అయితే, వాలిడ్ రెసిడెన్సీ పర్మిట్‌తో పాటు జాబ్ కాంట్రాక్ట్‌కు సంబంధించిన ధృవీకరణ పత్రాలు కలిగి ఉండి, విదేశీయులపై విధించిన బ్యాన్ తొలిగించిన తర్వాత కువైట్ రావొచ్చని స్పష్టం చేసింది. మొదటి డోసు టీకాకు సంబంధించిన సర్టిఫికేట్‌ను అప్‌లోడ్ చేసిన అధికారిక లింక్ ద్వారానే రెండో డోసుకు సంబంధించిన వివరాలను కూడా అప్డేట్ చేసుకోవాలని సూచించింది. అలాగే రెండు డోసులకు సంబంధించిన స్కాన్ కాపీలను పీడీఎఫ్ ఫార్మాట్‌లో(ఫైల్ సైజ్: 500కేబీల లోపు ఉండాలి) అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. 


https://vaxcert.moh.gov.kw/SPCMS/PH/CVD_19_Vaccine_External_RegistrationModify.aspx లింక్ ద్వారా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఎంబసీ తెలిపింది. కాగా, వ్యాక్సిన్ సర్టిఫికేట్ అప్డేట్ చేసేటప్పుడు దానిపై పాస్‌పోర్టు నెంబర్ వేయడం తప్పనిసరి. దీని కోసం ప్రవాసులు.. మొదట http://cowin.gov.inలో లాగిన్ అయిన తర్వాత రైజ్ ఏ ఇష్యూ‌ను సెలెక్ట్ చేసుకోవాలి. అనంతరం పాస్‌పోర్ట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత డ్రాప్ డౌన్ మెనుకు వెళ్లి పాస్‌పోర్ట్  నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే సరిపోతుంది. 


ఇదిలాఉంటే.. భారత రాయబారి సిబి జార్జ్ ఈ నెల 28న మధ్యాహ్నం 3.30 గంటలకు ఓపెన్ హౌస్ కార్యాక్రమం ద్వారా భారత ప్రవాసులతో మాట్లాడనున్నారు. స్వదేశంలో చిక్కుకున్న ప్రవాసులు తిరిగి కువైట్ వచ్చే విషయమై ఈ సమావేశంలో ఆయన అప్డేట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈ అంతర్జాల మీటింగ్‌కు సంబంధించిన వివరాలు..

మీటింగ్ లింక్: https://zoom.us/j/99978993243

మీటింగ్ ఐడీ: 999 7899 3243

పాస్‌వర్డ్: 512609

Updated Date - 2021-07-23T16:46:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising