ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎగుమతుల్లో అక్రమాలు.. ఇద్దరు ఎన్నారైలపై భారీ జరిమానాలు..!

ABN, First Publish Date - 2021-11-05T02:38:01+05:30

నిబంధనలకు విరుద్ధంగా స్క్రాప్ మెటల్‌ను భారత్‌కు ఎగుమతి చేయబోయిన ఇద్దరు ఎన్ఆర్‌ఐలపై దక్షిణాఫ్రికా న్యాయస్థానం ఇటీవల భారీ జరిమానాలు విధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్‌ డెస్క్: నిబంధనలకు విరుద్ధంగా స్క్రాప్ మెటల్‌ను భారత్‌కు ఎగుమతి చేయబోయిన ఇద్దరు ఎన్ఆర్‌ఐలపై దక్షిణాఫ్రికా న్యాయస్థానం ఇటీవల భారీ జరిమానాలు విధించింది. నాగేంద్ర కుడుపుడి అనే భారతీయ సంతతి వ్యక్తికి డర్బన్‌లోని న్యాయస్థానం 200,000 ర్యాండ్ల జరిమానా విధించింది. ఇంటర్నేషనల్ ట్రేడ్ అడ్మినిస్ట్రేషన్ కమిషన్‌కు ముందస్తు సమాచారం ఇచ్చి, తగు అనుమతి పొందకుండానే నాగేంద్ర స్క్రాప్‌ను ఎగుమతి చేసేందుకు ప్రయత్నించాడని కోర్టు పేర్కొంది. నిందితుడు కూడా నేరాన్ని ఒప్పుకోవడంతో..కోర్టు ఈ మేరకు జరిమానా విధించింది. మరో కేసులో.. దీపక్ కుమార్ మెుహతాకు కూడా అక్కడి న్యాయస్థానం ఇదే తరహా జరిమానా విధించింది. అతడు కూడా ఇంటర్నేషనల్ ట్రేడ్ అడ్మినిస్ట్రేషన్ కమిషన్‌ రూపొందించిన నిబంధనలు ఉల్లంఘించాడని పేర్కొంది. 200,000 ర్యాండ్ల జరిమానాను వచ్చే ఐదేళ్లలో చెల్లించాలని తీర్పు వెలువరించింది. ఇది చెల్లించలేని పక్షంలో ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. 

Updated Date - 2021-11-05T02:38:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising