ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait నుంచి విహారయాత్రకని వచ్చి.. సొంత ఊర్లో బిడ్డతో సహా.. Mangaloreలో ఘోరం

ABN, First Publish Date - 2021-09-14T00:00:16+05:30

కువైత్‌లో పనిచేసే ఓ మహిళ విహారయాత్ర కోసం భారత్ వచ్చి ఇక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బిడ్డను కాపాడుకోబోయి తన ప్రాణాలు కూడా పొగొట్టుకుంది. ఈ బాధాకరమైన సంఘటన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: కువైత్‌లో పనిచేసే ఓ మహిళ విహారయాత్ర కోసం భారత్ వచ్చి ఇక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బిడ్డను కాపాడుకోబోయి తన ప్రాణాలు కూడా పొగొట్టుకుంది. ఈ బాధాకరమైన సంఘటన శనివారం మంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 35ఏళ్ల రోసారియా కువైత్‌లోని అక్బర్ ట్రావెల్స్‌లో పనిచేస్తున్నారు. గతేడాది డిసెంబరులో తన కుమారుడు షాన్‌తో కలిసి మంగళూరులోని తన స్వగ్రామమైన కందాపూర్‌కు వచ్చారు. ఈ ఏడాది జనవరిలో తిరిగి వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. విమానాల రాకపోకలను కువైత్‌ నిషేధించడంతో భారత్‌లోనే ఉండిపోయారు. అయితే ఈ నెల 15న తిరిగి కువైత్ వెళ్లేందుకు ఆమె అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు.


ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం సమీపంలోని నది ఒడ్డున నడుస్తుండగా.. షాన్ కాలు జారి నదిలో పడిపోయాడు. కుమారుడు నదిలో పడిపోవడంతో అతడిని కాపాడాలని రోసారియా కూడా నదిలో దూకేశారు. అయితే రోసారియాకు ఈత రాకపోవడంతో కొడుకుతో పాటు ఆమె కూడా నీటిలో మునిగి చనిపోయాడు. ఆమె మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.


రోసారియా మరణవార్తతో తాను తీవ్ర ఆవేదనకు గురయ్యానని కువైత్‌లోని అక్బర్ ట్రావెల్స్ రీజనల్ మేనేజర్ షేక్ అబ్దుల్లా అన్నారు. వారం రోజుల క్రితమే ఆమెతో తాను మాట్లాడానని, కొద్ది రోజుల్లో ఆమె ఇక్కడకు వచ్చి విధుల్లో చేరతారని అనుకుంటుండగా ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-09-14T00:00:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising