ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్ట్రేలియాలో భారత సంతతి డ్రైవర్‌కు 22 ఏళ్ల జైలు శిక్ష!

ABN, First Publish Date - 2021-04-15T17:02:45+05:30

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో మద్యం మత్తులో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి, నలుగురు పోలీస్ అధికారుల మృతికి కారణమైన భారత సంతతి ట్రక్కు డ్రైవర్‌కు తాజాగా అక్కడి న్యాయస్థానం 22 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో మద్యం మత్తులో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి, నలుగురు పోలీస్ అధికారుల మృతికి కారణమైన భారత సంతతి ట్రక్కు డ్రైవర్‌కు తాజాగా అక్కడి న్యాయస్థానం 22 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే.. మోహిందర్ సింగ్(48) అనే భారత సంతతి వ్యక్తి మెల్‌బోర్న్‌లో ట్రక్కు డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గతేడాది ఏప్రిల్ 22న మద్యం మత్తులో ఉన్న మోహిందర్.. ఈస్టర్న్ ఫ్రీవేపై తనిఖీలు నిర్వహిస్తున్న పోలీస్ వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో ఆ వాహనంలో ఉన్న నలుగురు పోలీసులు లినెట్ టేలర్, కెవిన్ కింగ్, గ్లెన్ హంఫ్రిస్, జోష్ ప్రెస్ట్నీ అక్కడికక్కడే చనిపోయారు. అనంతరం పోలీసులు మోహిందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు బుధవారం విక్టోరియా సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. దీంతో దోషిగా తేలిన మోహిందర్‌కు న్యాయస్థానం 22 ఏళ్ల జైలు విధిస్తూ తీర్పునిచ్చింది.    


Updated Date - 2021-04-15T17:02:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising