ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

America లో చరిత్ర సృష్టించిన భారతీయురాలు.. తొలి మహిళగా రికార్డ్!

ABN, First Publish Date - 2021-12-10T19:17:38+05:30

అగ్రరాజ్యం అమెరికాలో ఓ భారత సంతతి మహిళ చరిత్ర సృష్టించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెన్సిల్వేనియా: అగ్రరాజ్యం అమెరికాలో ఓ భారత సంతతి మహిళ చరిత్ర సృష్టించారు. అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మకమైన పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ అధ్యక్షురాలిగా భారతీయ సంతతికి చెందిన ప్రొఫెసర్ నీలి బెండపూడి నియమితులయ్యారు. దీంతో ఈ పదవి చేపట్టబోతున్న తొలి మహిళ, శ్వేతజాతీయేతరాలుగా ఆమె చరిత్రకెక్కారు. ఈ మేరకు గురువారం యూనివర్శిటీ ఆమె నియామకాన్ని ధృవీకరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన బెండపూడి.. ఉన్నత విద్య కోసం 1986లో అమెరికాకు వెళ్లారు. అనంతరం అక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆమె లూయిస్ విల్లే యూనివర్శిటీలో మార్కెటింగ్ ప్రొఫెసర్‌గాను, వర్శిటీ అధ్యక్షురాలిగాను కొనసాగుతున్నారు. ఈ క్రమంలో పెన్సిల్వేనియా స్టేట్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ డిసెంబర్ 9న ఆమెను వర్శిటీ తదుపరి అధ్యక్షురాలిగా ఎన్నుకోవడం జరిగింది. 2022లో ఆమె ఈ పదవి చేపట్టనున్నారు. ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల బెండపూడి ఆనందం వ్యక్తం చేశారు.     

Updated Date - 2021-12-10T19:17:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising