ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

'మాస్ట‌ర్‌చెఫ్ ఆస్ట్రేలియా' టైటిల్ గెలిచిన భార‌త సంత‌తి వ్య‌క్తి.. రూ.1.86కోట్లు సొంతం!

ABN, First Publish Date - 2021-07-14T20:44:44+05:30

భార‌త సంత‌తి వ్య‌క్తి జ‌స్టిన్ నారాయ‌ణ్ ఏకంగా 'మాస్ట‌ర్‌చెఫ్ ఆస్ట్రేలియా' టైటిల్ గెలిచి అంద‌రినీ గ‌ర్వ‌ప‌డేలా చేశారు. ఈ పాపుల‌ర్ టెలివిజ‌న్ షో 13వ సీజ‌న్ టైటిల్ గెలిచిన నారాయ‌ణ్‌కు 2.50ల‌క్ష‌ల డాల‌ర్లు (రూ. 1.86కోట్లు) ప్రైజ్‌మ‌నీ ద‌క్కింది. త‌న‌తో పాటు ఫైన‌ల్‌కు వ‌చ్చిన మ‌రో ఇద్ద‌రు కిశ్వ‌ర్ చౌద‌రీ, పెట్ క్యాంప్‌బెల్‌ను ఓడించి నారాయ‌ణ్ ఈ టైటిల్ సొంతం చేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్ట‌న్‌: భార‌త సంత‌తి వ్య‌క్తి జ‌స్టిన్ నారాయ‌ణ్ ఏకంగా 'మాస్ట‌ర్‌చెఫ్ ఆస్ట్రేలియా' టైటిల్ గెలిచి అంద‌రినీ గ‌ర్వ‌ప‌డేలా చేశారు. ఈ పాపుల‌ర్ టెలివిజ‌న్ షో 13వ సీజ‌న్ టైటిల్ గెలిచిన నారాయ‌ణ్‌కు 2.50ల‌క్ష‌ల డాల‌ర్లు (రూ. 1.86కోట్లు) ప్రైజ్‌మ‌నీ ద‌క్కింది. త‌న‌తో పాటు ఫైన‌ల్‌కు వ‌చ్చిన మ‌రో ఇద్ద‌రు కిశ్వ‌ర్ చౌద‌రీ, పెట్ క్యాంప్‌బెల్‌ను ఓడించి నారాయ‌ణ్ ఈ టైటిల్ సొంతం చేసుకున్నారు. నారాయణ్ ట్రోఫీ గెలిచిన విష‌యాన్ని మాస్ట‌ర్‌చెఫ్ ఆస్ట్రేలియా త‌న అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా తెలియ‌జేసింది. ఈ సంద‌ర్భంగా నారాయ‌ణ్ టైటిల్ అందుకున్న స‌మ‌యంలో తీసిన వీడియోను షేర్ చేసింది.


ఈ వీడియోకు 'జ‌స్టిన్ నారాయ‌ణ్ ఆనందానికి అవ‌ధుల్లేవ్' అనే క్యాప్ష‌న్‌ను జోడించింది. నారాయ‌ణ్ కూడా త‌న విజ‌యం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ సీజ‌న్‌లో పాల్గొన్న కంటెస్టెంట్స్‌, జ‌డ్జిలకు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. ఇది త‌న జీవితంలోనే అత్యంత అద్భుత‌మైన ఎక్స్‌పీరియ‌న్స్ అని చెప్పారు. అలాగే ఈ 13వ సీజ‌న్‌లో మ‌రో భార‌త సంతతి వ్య‌క్తి డిపిందర్ చిబ్బర్ కూడా పోటీప‌డ్డారు. 

Updated Date - 2021-07-14T20:44:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising