ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాసా ట్రెయినీ ఆస్ట్రోనాట్‌గా భారతీయ సంతతి వ్యక్తి ఎంపిక

ABN, First Publish Date - 2021-12-08T01:52:51+05:30

అమెరికాఅంతరిక్ష సంస్థ (నాసా) చేపట్టబోతున్న వ్యోమగామి(ఆస్ట్రోనాట్) శిక్షణా కార్యక్రమానికి తాజాగా ఓ భారతీయ సంతతి వ్యక్తి ఎంపికయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) చేపట్టబోతున్న వ్యోమగామి(ఆస్ట్రోనాట్) శిక్షణా కార్యక్రమానికి తాజాగా ఓ భారతీయ సంతతి వ్యక్తి ఎంపికయ్యారు. యూక్రెయిన్, భారతీయ మూలాలున్న డా. అనీల్ మీనన్ ఈ అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. ఈ కార్యక్రమానికి మొత్తం 12 వేల మంది దరఖాస్తు చేసుకోగా నాసా చివరికి 10 మందిని ఎంపిక చేసింది. వీరిలో అనీల్ మీనన్ కూడా ఒకరు. రెండేళ్ల పాటు సాగే ఈ శిక్షణ కార్యక్రమం అనంతరం ఈ 10 మంది  వివిధ అంతరిక్ష మిషన్లలో వ్యోమగాములుగా పాల్గొంటారు. 


యూక్రేయిన్, భారతీయ మూలాలున్న డా. మీనన్(45) మిన్నెసొటా రాష్ట్రంలో జన్మించారు. గతంలో ఆయన స్పేస్ ఎక్స్ సంస్థలో ఫ్లైట్ సర్జన్‌గా సేవలందించారు. స్పెక్స్ సంస్థ చేపట్టిన డెమో-2 మిషన్‌లో పాలుపంచుకున్నారు. 2014లో ఆయన నాసాలో చేరారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు చెందిన నాలుగు దీర్ఘకాలిక మిషన్లలో డిప్యూటీ క్రూ సర్జన్‌గా పాలుపంచుకున్నారు. సోయూజ్ మిషన్లలో ప్రధాన క్రూ సర్జన్‌గా కూడా సేవలందించారు.  


1995లో అనీల్ మీనన్ హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి న్యూరోబయాలజీలో డిగ్రీ పట్టా పొందారు. 2004లో స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు. అంతేకాకుండా.. ఆయన స్టాన్‌ఫర్డ్ మెడికల్ స్కూల్‌ నుంచి మెడికల్ క్వాలిఫికేషన్ కూడా పొందారు. ఎమర్జెన్సీ మెడిసిన్‌లో మెళకువలు నేర్చుకున్నారు. 


ఇక అమెరికా వాయుసేన మిషన్లలోనూ డా. మీనన్ 45వ స్పేస్ వింగ్‌కు ఫ్లైట్ సర్జన్‌గా సహాయం అందించారు. ప్రమాదకర స్థితిలో ఉన్న 100 పేషెంట్లను వాయుమార్గంలో తరలించిన అనుభవం ఆయన సొంతం. 


ట్రెయినీ ఆస్ట్రొనాట్లుగా ఎంపికైన వారిలో అమెరికా ఎయిర్ ఫోర్స్‌కు చెందిన మేజర్ నికోల్ ఏయర్స్, మేజర్ మార్కోస్ బెర్రియోస్, మెరీన్ కోర్‌కు చెందిన రిటైర్డ్ మేజర్ ల్యూక్ డిలానీ, నేవీ లెఫ్టెనెంట్ కమాండర్ జెస్సికా విట్నర్, నేవీ లెఫ్టెనెంట్ డెనీజ్ బర్నహమ్, కమాండర్ జాక్ హాథవే, క్రిస్టోఫర్ విలియమ్స్, క్రిస్టీనా బర్చ్, ఆండ్రే డగ్లస్ ఉన్నారు.  ట్రెయినీ ఆస్ట్రొనాట్‌ల ఎంపికలో నాసా వైవిధ్యానికి పెద్ద పీట వేసింది. నాసా ప్రకటన ప్రకారం మొత్తం ఐదు అంశాల్లో ట్రెయినీలు శిక్షణ పొందనున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని సంక్లిష్ట వ్యవస్థల నిర్వహణ, స్పేస్ వాక్, సంక్లిష్ట రోబోట్ నిర్వహణ, టీ-38 ట్రెయినింగ్ జెట్‌ ఆపరేషన్, రష్యా భాషలో తర్ఫీదు పొందుతారు. 

Updated Date - 2021-12-08T01:52:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising