ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార‌త్‌కు 8వేల ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు పంపిన‌ కువైట్‌!

ABN, First Publish Date - 2021-06-15T15:01:10+05:30

మ‌హ‌మ్మారి క‌రోనాపై పోరులో భార‌త్‌కు చేదోడుగా నిలుస్తున్న గ‌ల్ఫ్ దేశం కువైట్ తాజాగా మ‌రో 8వేల ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు పంపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైట్ సిటీ: మ‌హ‌మ్మారి క‌రోనాపై పోరులో భార‌త్‌కు చేదోడుగా నిలుస్తున్న గ‌ల్ఫ్ దేశం కువైట్ తాజాగా మ‌రో 8వేల ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు పంపుతోంది. భార‌త సౌకద‌ళానికి చెందిన ఐఎన్ఎస్ శార్దుల్ ఈ సిలిండర్ల‌ను తీసుకుని ఆదివారం కువైట్‌లోని షువైఖ్ పోర్ట్ నుంచి బ‌య‌ల్దేరింది. క్రిప్టో రీలిఫ్ ఫండ్‌, ఎయిర్‌టెక్ గ్రూపు వారి స‌హకారంతో భార‌త్‌కు కువైట్ ఈ సాయం అందిస్తోంది. ఈ సిలిండర్ల విలువ సుమారు రెండు మిలియ‌న్ల డాల‌ర్లు ఉంటుంద‌ని ఎయిర్‌టెక్ గ్రూపు చీఫ్ ఆప‌రేష‌న్ ఆఫీస‌ర్ పియూష్ జైన్ తెలిపారు. ఈ సాయంలో క్రిప్టో రీలిఫ్ ఫండ్‌కు చెందిన సందీప్ నైల్‌వాల్‌, వివేక్ ప‌వార్ స‌హ‌కారం మ‌రిచిపోలేనిద‌ని ఆయ‌న పేర్కొన్నారు. షువైఖ్ పోర్ట్‌లో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల త‌ర‌లింపుకు సంబంధించిన ప్ర‌క్రియ‌ను కువైట్‌లోని భార‌త రాయ‌బారి సిబి జార్జ్‌, కువైట్ పోర్ట్స్ అథారిటీ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ యూసుఫ్ అబ్దుల్లా అల్ స‌భా, డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ప‌బ్లిక్ అథారిటీ అబ్దుల్ క‌రీం అల్ త‌కీ పూర్తి చేశారు. ఇక సెకండ్ వేవ్‌తో పోరాడుతున్న భార‌త్‌కు ఇప్ప‌టికే కువైట్ లిక్విఫైడ్ మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌తో పాటు ఇత‌ర కీల‌క వైద్య ప‌రిక‌రాల‌ను అందించిన విష‌యం తెలిసిందే.      

Updated Date - 2021-06-15T15:01:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising